
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. రవి నిర్ణయం వల్ల తనకు, తన పిల్లలకు ఏమాత్రం మంచి జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఈమేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశారు ఆర్తి. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ‘నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో ఆవేదన చెందాను. మేం 18 ఏళ్లుగా కలిసి ఉంటున్నాం. అలాంటిది విడాకుల విషయాన్ని నా పర్మిషన్ తీసుకోకుండా బహిరంగంగా ప్రకటించడం నన్ను చాలా బాధిస్తోంది.
గత కొంతకాలంగా మా మధ్య వచ్చిన పొరపచ్చాలను పరిష్కరించుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాను. కానీ దురదృష్టవశాత్తూ నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం రాలేదు. ఇప్పటికీ నేను ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ ప్రకటనతో నేను, నా పిల్లలు షాకయ్యాం. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల నాకు, నా పిల్లలకు ఎలాంటి మంచి జరగదు’
మనసులో తీరని బాధ ఉన్నప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే బహిరంగంగా ఏం మాట్లాడడం లేదు. కానీ అన్యాయంగా నాపై నిందలు వేసి.. నన్ను చెడుగా చూపిస్తున్నారు. ఇలాంటి వార్తలను భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల భవిష్యత్తే. ఇలాంటి అసత్యపు వార్తలు వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పుడిదే నన్ను ఎక్కువగా బాధిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను భావిస్తున్నాను. ఇన్ని రోజులుగా మాకు అండగా నిలబడిన మీడియా మిత్రులు, అభిమానులను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమాభిమానాలే మాకు గొప్ప బలం. మా ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించొద్దని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ‘ అని చెప్పుకొచ్చారు ఆర్తి.
ప్రస్తుతం ఈపోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి దీనిపై హీరో జయం రవి ఎలా స్పందిస్తాడో చూడాలి.
Grateful for your love and understanding.
Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8
— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.