Jani Master: నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద జానీ భార్య అయేషా చిందులు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌ అలియాస్ షేక్ జానీ బాషాపై పోక్సో కేసు నమోదయింది. తాజాగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారంటూ ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ఒకరు ఇటీవల ఫిర్యాదు చేశారు. 21 ఏళ్ల ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Jani Master: నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద జానీ భార్య అయేషా చిందులు
Ayesha
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 19, 2024 | 2:51 PM

తన అసిస్టెంట్‌గా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలుమార్లు బాధితురాలిని విచారించారు పోలీసులు… పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్‌ను యాడ్‌ చేశారు. ఇక జానీ మాస్టర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో గురువారం అరెస్ట్‌ చూపించి.. శుక్రవారం కోర్టులో ప్రొడ్యూస్‌ చేస్తారు.

జానీమాస్టర్‌పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు. ఓ డాన్స్‌ షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు. ఆ షోలో పార్టిసిపేట్‌ చేయడంతో.. ఏర్పడిన పరిచయంతో 2019లో కాల్‌ చేసి తన గ్రూపులో చేర్చుకుంటానన్నారని చెప్పారు. ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు జానీ మాస్టర్‌ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్‌ చేశారు. ప్రతిఘటిస్తే కొట్టి, హింసించే వారని.. మతం మార్చుకుని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంటూ ఆవేదన వెళ్లగక్కారు. షూటింగ్‌ వానిటీ వ్యాన్‌లో ఎన్నొసార్లు లైంగికంగా వేధించారన్నారు బాధితురాలు. అందరిముందే అసభ్యంగా టచ్‌ చేసేవారని.. ఓసారి ఇంటికి వచ్చి జానీ మాస్టర్‌, ఆయన భార్య అయేషా బెదిరించారని.. భార్య అయితే.. పలుమార్లు కొట్టారంటూ ఆరోపించారు.  తన దగ్గర ఉద్యోగం మానేసినప్పటికీ జానీ మాస్టర్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారని, మతం మారాలంటూ బెదిరించారని పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఉంది.

ఇక జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. నార్సింగి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న అతని భార్య అయేషా మీడియా వాళ్లతో అతిగా ప్రవర్తించారు. అక్కడున్న వారితో అయేషా దురుసుగా ప్రవర్తిస్తూ రుసరుసలాడారు. జానీపై కేసుకు సంబంధించి వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా.. అందరిపై కేసులు పెడతానంటూ బెదిరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.