Jani Master: జానీ మాస్టర్ కొత్త సినిమా! దివంగత పునీత్ రాజ్‌కుమార్ ఆశీస్సులు తీసుకున్న స్టార్ కొరియోగ్రాఫర్

లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి బెయిల్‌పై విడుదలైన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా బెంగళూరుకు విచ్చేశాడు. ఈ సందర్భంగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ సమాధులను సందర్శించిన జానీ మాస్టర్ వారికి నివాళులు అర్పించారు.

Jani Master: జానీ మాస్టర్ కొత్త సినిమా! దివంగత పునీత్ రాజ్‌కుమార్ ఆశీస్సులు తీసుకున్న స్టార్ కొరియోగ్రాఫర్
Jani Master

Updated on: Jan 30, 2025 | 11:50 AM

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బుధవారం (జనవరి 29) బెంగళూరు లో పర్యటించాడు. కంఠీరవ స్టూడియోను సందర్శించిన అతను రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ సమాధులను సందర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా జానీ మాస్టర్ బెంగుళూరులో ఓ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడని, అందుకోసం అప్పు, సమాధిని దర్శించుకుని ఆశీస్సులు పొందాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అతనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బెంగుళూరులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు అప్పు, డాక్టర్ రాజ్‌కుమార్‌లకు నివాళులు అర్పించి వారి ఆశీస్సులు పొందానని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడీ స్టార్ కొరియోగ్రాఫర్. జానీ మాస్టర్ కన్నడలో ఓ సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత ఈ రూమర్ దాదాపు నిజమైంది. కాగా బెంగుళూరులో జానీ మాస్టర్ డ్యాన్స్ అకాడమీని ప్రారంభించబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

జానీ మాస్టర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్, ప్రతిభావంతుడైన స్టార్ కొరియోగ్రాఫర్. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ తదితర తెలుగు హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. తమిళ్ లో విజయ్, కన్నడలో సుదీప్, పునీత్ రాజ్ కుమార్ వంటి హీరోలతోనూ కలిసి పని చేశాడు. అయితే గతేడాది జానీ మాస్టర్‌పై అతని టీమ్‌లో పనిచేస్తున్న ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో జానీ మాస్టర్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 19, 2024న గోవాలో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత అతనికి అక్టోబర్ 24న బెయిల్ లభించింది.

ఇవి కూడా చదవండి

పునీత్ రాజ్ కుమార్, రాజ్ కుమార్ సమాధుల వద్ద జానీ మాస్టర్..

ఇటీవల రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలోని ఓ పాటను కంపోజ్ చేశారు జానీ మాస్టర్. ధోప్ అనే పాటకు నృత్య రీతులు సమకూర్చారు. ఈ సాంగ్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..