
దివంగత హీరోయిన్.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి చెప్పక్కర్లేదు. ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేకం గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ ఇప్పుడు తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో అచ్చ తెలుగమ్మాయి… గ్రామీణ యువతిగా తంగం పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత జాన్వీ నటిస్తోన్న రెండో తెలుగు సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఉప్పెన మూవీ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..
గతంలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ భారీగా అంచనాలు క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండానే జాన్వీ కపూర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో జాన్వీ పాత్ర ఎలా ఉండబోతుందనేది చిన్న హింట్ ఇచ్చారు. గతంలో దేవర సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన జాన్వీ.. ఇప్పుడు పెద్ది చిత్రంలోనూ దాదాపు అలాంటి పాత్రలోనే నటించనుంది.
ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..
ఇందులో అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుంది జాన్వీ. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మైక్ సెట్టింగ్ నిర్వహించే పాత్రలా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో మరింత అందంగా కనిపిస్తుంది జాన్వీ. ఇందులో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. స్పో్ర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేయనున్నారు.
Our #Peddi's love with a firebrand attitude 😎🔥
Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/mdU2a3oxp6
— BuchiBabuSana (@BuchiBabuSana) November 1, 2025
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?