Peddi Movie : శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ.. తిరుమల శ్రీవారి దర్శనంలో పెద్ది హీరోయిన్.. పట్టు చీరలో ఎంత క్యూట్‏గా ఉందో..

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ దంపతుల పెద్ద కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన నటన, గ్లామర్‌తో చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన 'దడక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు పెద్ది చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది.

Peddi Movie : శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ.. తిరుమల శ్రీవారి దర్శనంలో పెద్ది హీరోయిన్.. పట్టు చీరలో ఎంత క్యూట్‏గా ఉందో..
Janhvi Kapoor

Updated on: Jun 04, 2026 | 12:26 PM

స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తాజా చిత్రం ‘పెద్ది’ ఈ రోజే విడుదలైన నేపథ్యంలో ఆమె స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు విచ్చేశారు. బుధవారం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్, గురువారం ఉదయం నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు జాన్వీ కపూర్ , మహేశ్వరికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సైతం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం భార్య, కూతురితో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

కాగా, జాన్వీ కపూర్, రామ్ చరణ్ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ ఈ రోజు (జూన్ 4, 2026) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బుధవారమే సినిమా ప్రీమియర్స్ పడగా.. రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు మేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బుక్‌మై షోలో గంటకు 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతూ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రం విడుదలైన రోజే దైవ దర్శనం చేసుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

ఇదిలా ఉంటే.. పట్టు చీరలో జాన్వీ మరింత క్యూట్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా చీరకట్టులో జాన్వీ అచ్చం తన తల్లి, దివంగత హీరోయిన్ శ్రీదేవిని గుర్తు చేస్తుందని. ఎంతో క్యూట్ గా.. మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ది తర్వాత తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించడం ఖాయమని తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

జాన్వీ కపూర్..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us