Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Raj Kumar: పునీత్ నటించిన లాస్ట్ చిత్రం జేమ్స్ డ్రోన్ షూటింగ్ వీడియో వైరల్‌…రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కి శాండల్‌వుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరో.  ఆయన  ఆకస్మిక మరణం అందరికీ షాక్.  పునీత్ మరణంకన్నడ చిత్ర పరిశ్రమకు..

Puneeth Raj Kumar: పునీత్ నటించిన లాస్ట్ చిత్రం జేమ్స్ డ్రోన్ షూటింగ్ వీడియో వైరల్‌...రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్
Puneeth Raj Kumar
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 11, 2021 | 6:56 PM

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కి శాండల్‌వుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరో.  ఆయన  ఆకస్మిక మరణం అందరికీ షాక్.  పునీత్ మరణంకన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. పునీత్ అంగీకరించిన చాలా ప్రాజెక్టులు సగంలో నిలిచిపోయాయి. ఆయన నటించిన ‘జేమ్స్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  చేతన్ కుమార్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే జేమ్స్ సినిమా విడుదలకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. మార్చి 27న పునీత్ బర్త్ డే కానుకగా జేమ్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  అయితే పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూటింగ్ వీడియో వైరల్‌గా మారింది.

చేతన్ కుమార్  జేమ్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సినిమా లావిష్ నెస్ ఉంటుందని చెప్పారు. అయితే తాజాగా జేమ్స్ సినిమా మేకింగ్ వీడియో వైరల్‌గా మారింది. పునీత్ రాజ్ కుమార్ జలపాతం దగ్గర నిలబడి ఉన్నారు. ఈ సన్నివేశాలను చిత్ర యూనిట్ డ్రోన్‌ తో చిత్రీకరించారు. జేమ్స్ చిత్రీకరణ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చుసిన అభిమానులు  ‘మిస్ యూ అప్పు’ అంటూ షేర్ చేస్తున్నారు. జేమ్స్ సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తి అయ్యింది. అయితే ఈ పాట చిత్రీకరణకు పునీత్ రాజ్ కుమార్ డేట్స్ ఇచ్చారు. సాంగ్ చిత్రీకరణ జరగకముందే ఘోర చోటు చేసుకుంది. తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు పునీత్.. అంతేకాదు పునీత్ జేమ్స్ మూవీలో తన పాత్రకు సగం డబ్బింగ్ పూర్తి చేశారు. మిగతా డబ్బింగ్ చెప్పించే దిశగా డైరెకర్ చేతన్ ఆలోచిస్తున్నారు.

ఇదే విషయంపై చేతన్ మాట్లాడుతూ.. జేమ్స్ సినిమా తప్పకుండా విడుదలవుతుంది. పునీత్‌కి మరో వైపు సోదరుడు శివరాజ్‌ కుమార్‌ వాయిస్‌ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. శివన్న వాయిస్‌ ఇస్తే డబ్బింగ్‌ వర్క్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తామని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై శివరాజ్ కుమార్ ను సంప్రదించామని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇదే విషయంపై శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తన వద్దకు ఇంకా ఎటువంటి ప్రతిపాదన రాలేదని.. ఒకవేళ పునీత్ కు వాయిస్‌ని ఇవ్వడం అంటే తనకు నిజంగా గర్వకారణమని చెప్పారు.

Also Read:  మళ్ళీ వెండి తెరపై క్రేజీ కాంబో.. అన్నయ్య మూవీలో కీలక పాత్రలో మాస్ మహారాజా అంటూ టాక్..