Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi-Ravi Teja: మళ్ళీ వెండి తెరపై క్రేజీ కాంబో.. అన్నయ్య మూవీలో కీలక పాత్రలో మాస్ మహారాజా అంటూ టాక్..

Chiranjeevi-Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి నెంబర్ వన్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు ఏలారు. ఇక చిరంజీవిని..

Chiranjeevi-Ravi Teja: మళ్ళీ వెండి తెరపై క్రేజీ కాంబో.. అన్నయ్య మూవీలో కీలక పాత్రలో మాస్ మహారాజా అంటూ టాక్..
Chiru Raviteja
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2021 | 5:12 PM

Chiranjeevi-Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి నెంబర్ వన్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు ఏలారు. ఇక చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని తర్వాత శ్రీకాంత్, రవితేజ్, నాని , వంటి వారు టాలీవుడ్ లో అడుగు పెట్టారు. చిన్న చిన్న పాత్రలతో సినీ జర్నీ మొదలు పెట్టి.. స్టార్ హీరోలుగా అభిమానులను అలరిస్తున్నారు. అయితే చిరంజీవి సినిమాలో మాస్ మహారాజా రవితేజ మళ్ళీ కలిసి నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. వరస సినిమాలతో చిరు బిజీ అయ్యారు. సైరా నరసింహా రెడ్డి తర్వాత ఆచార్య సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భోళా శంకర్  షూటింగ్ ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే గాడ్ ఫాదర్ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో బాబీ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ్ కూడా నటించనున్నారని టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో రవితేజ అయితే కరెక్ట్ గా సెట్ అవుతారని భావించిన బాబీ ఇప్పటికే రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా.. ఇక బాబీతో ఉన్న స్నేహంతో రవితేజ్ వెంటనే ఒకే అన్నాడట. ఈ విషయం త్వరలో అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించనున్నదట.  ఇప్పటికే చిరంజీవి అన్నయ్య సినిమాలో రవితేజ , వెంకట్ లు తమ్ముల్లుగా నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్ని ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో మాస మహారాజా రవితేజ జతకడితే.. సినిమాకు అదనపు మైలేజ్ ఖాయం.. అభిమానులను మరింత అలరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదంటూ ఫిల్మ్ నగర్ టాక్.

Also Read: ఇల్లు కొనలేక బస్సునే ఇల్లుగా మార్చుకున్న మోడల్‌.. అధునిక వసతులతో అందంగా అలంకరించిన వైనం..