Jai Hanuman: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సాక్షిగా ‘జై హనుమాన్‌’ ప్రారంభం.. ఆంజనేయుడిగా ఆ స్టార్‌ హీరో

|

Jan 23, 2024 | 12:10 PM

అయోధ్య వేదికగా సోమవారం (జనవరి 22) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశం మొత్తం ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసింది. ఈ పవిత్రమైన రోజున రామాయణానికి సంబంధించిన సినిమాలు కూడా తెరమీదకు వచ్చాయి. ‘శ్రీరామ్ జై హనుమాన్’ అనే సినిమా సెట్స్ పైకి వచ్చింది.

Jai Hanuman: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సాక్షిగా జై హనుమాన్‌ ప్రారంభం.. ఆంజనేయుడిగా ఆ స్టార్‌ హీరో
Jai Hanuman Movie
Follow us on

అయోధ్య వేదికగా సోమవారం (జనవరి 22) బాల రాముడి  ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశం మొత్తం ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసింది. ఈ పవిత్రమైన రోజున రామాయణానికి సంబంధించిన సినిమాలు కూడా తెరమీదకు వచ్చాయి. ‘శ్రీరామ్ జై హనుమాన్’ అనే సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ శుభసందర్భంలోనే ‘ హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ను ప్రారంభించారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను అయోధ్య భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువైన శుభవేళలో ప్రకటించాడు డైరెక్టర్‌. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా జై హనుమాన్‌ లో ఆంజనేయుడిగా ఒక స్టార్‌ హీరో నటిస్తాడని ప్రశాంత్‌ వర్మ చెబుతున్నాడు. దీంతో అభిమానులు ఆ స్టార్‌ హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అని అభిప్రాయ పడుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన హనుమాన్ జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటి అమృత అయ్యర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయం తర్వాత దర్శకుడు ‘జై హనుమాన్’ సినిమాకి శ్రీకారం చుట్టాడు. ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) కింద రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. హైదరాబాద్ హనుమాన్ ఆలయంలో స్క్రిప్ట్ పూజ నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రానున్న రోజుల్లో తెలియచేస్తామంచి చిత్ర బృందం. అమ్మిన ప్రతి టిక్కెట్టుకు ఐదు రూపాయలను రామమందిరానికి విరాళంగా అందజేస్తామని బృందం ప్రకటించింది. 53.28 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీని ద్వారా చిత్ర బృందం 2.66 కోట్ల రూపాయలను రామమందిర నిర్మాణానికి విరాళంగా అందజేసింది. ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

పూజా కార్యక్రమాలతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి