Jagapathi Babu: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్. టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలక్షణ నటుడు జగపతి బాబు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగపతి బాబు మాట్లాడుతూ.. రిపబ్లిక్ లాంటి సినిమాలు జనాలకు నచ్చవు అనుకున్నా అన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ.. రిపబ్లిక్ సినిమా రిలీజ్ తరువాత పరిస్థితి చూసి భాధ అనిపించిందని అన్నారు. అంతేకాదు ఆడియన్స్ కి రిపబ్లిక్ సినిమా లాంటి మంచి కాన్సెప్ట్ సినిమాలు నచ్చవు.. ఆడియన్స్ కి చెత్త చెదారం వున్న సినిమాలే కావాలి అనుకున్నాను కానీ రిపబ్లిక్ కి ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.. దేవా కట్టా కష్టం ఫలించింది. ప్రేక్షకులు రిపబ్లిక్ సినిమా ని ఓటిటి లో పెద్ద ఎత్తున్న ఆదరిస్తారు అని అన్నారు జగపతిబాబు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఈ నెల 26 నుంచి ‘జీ 5’ ఓటీటీ వేదికలో ‘రిపబ్లిక్’ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :