AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవరైనా ఒక టీ తాగిస్తే బాగుండు అనుకున్న రోజుల నుంచి.. ఆ తర్వాత ఈ స్థాయికి..

జబర్దస్త్ నటుడు రాము తన ప్రస్థానంలోని కష్టాలను పంచుకున్నారు. గ్రూప్ డ్యాన్సర్‌గా మొదలై, తినడానికి తిండి లేక, అద్దె కట్టలేక నానా ఇబ్బందులు పడ్డారు. తండ్రి మందలింపుతో మూణ్నెల్లు గడువు పెట్టుకున్నారు. ఆ సమయంలోనే జబర్దస్త్‌లో లేడీ గెటప్ పాత్రతో అవకాశం వచ్చి, ఆయన జీవితం మారిపోయింది.

ఎవరైనా ఒక టీ తాగిస్తే బాగుండు అనుకున్న రోజుల నుంచి.. ఆ తర్వాత ఈ స్థాయికి..
Jabardasth Ramu
Ram Naramaneni
|

Updated on: Apr 08, 2026 | 8:48 AM

Share

జబర్దస్త్ నటుడు రాము తన జీవితంలోని హృదయవిదారక ప్రయాణాన్ని, కష్టాలను ఓ ఇంటర్వ్యూలో ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు. గ్రూప్ డ్యాన్సర్‌గా తన కళాజీవితాన్ని ప్రారంభించిన రాము, క్రమంగా రూ. 200 నుంచి రూ. 1 లక్ష వరకు సంపాదించినప్పటికీ, ఎప్పుడూ డబ్బులు వెనకేసుకోలేకపోయానని పేర్కొన్నారు. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చులకే వెళ్ళిపోయేదని, పండగలప్పుడు ఇంటికి ఇచ్చిన డబ్బులు సైతం తిరిగి తల్లిదండ్రుల నుంచే తీసుకోవాల్సి వచ్చేదని వివరించారు. 2013లో హైదరాబాద్‌లో రాము అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. తినడానికి తిండి లేక, రూమ్ అద్దె కట్టలేక నానా ఇబ్బందులు పడ్డారు. గ్రీన్ బావర్చి వద్ద ఒక టీ కోసం ఎదురుచూసిన రోజులను, రూమ్ ఓనర్ అద్దె అడుగుతాడని భయపడి ఉదయాన్నే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఈ కష్టాలు ఇంట్లో కూడా చెప్పలేదని, చెప్తే వెనక్కి రమ్మంటారని భయపడ్డారని తెలిపారు. ఈ కష్టాల మధ్య ఒక రాత్రి తండ్రి నుండి వచ్చిన ఫోన్ కాల్ రామును మరింత కలచివేసింది. చదువుకున్నవారంతా ఉద్యోగాలు చేసుకుంటుంటే, తను ఏమి చేస్తున్నాడని నలుగురు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలని తండ్రి నిరాశతో అడిగారు. తండ్రి మాటలతో తీవ్రంగా కలత చెందిన రాము, తనకు మూడు నెలలు గడువు ఇవ్వమని, ఈ లోపు ఏదైనా సాధించకపోతే ఇంటికి తిరిగి వచ్చి తండ్రి చెప్పిన పని చేసుకుంటానని మాట ఇచ్చారు.

ఆ మూడు నెలలు కూడా కష్టాలు తగ్గలేదు. రెంటు, తిండి సమస్యలు తీవ్రమయ్యాయి. అదే సమయంలో, చంద్ర టీమ్‌కు చెందిన శ్రీ అనే మిత్రుడు జబర్దస్త్ అనే కొత్త కామెడీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అందులో అభి టీమ్ లీడర్‌గా వస్తున్నారని, అవకాశం వస్తుందని రాముకు చెప్పారు. ఆడిషన్ కోసం సారథి స్టూడియోస్‌కి వెళ్ళిన రాముకు ఆకలితో అలమటిస్తున్న వేళ శ్రీ.. టీ, బిస్కెట్లు ఇచ్చారు. మొదట మిమిక్రీ చేసి చూపించినా, అది ఎంపిక కాలేదు. నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత, 2013 ఆగస్టు 14 ఉదయం 6:30 గంటలకు అదిరే అభి నుంచి లేడీ గెటప్ కోసం కాల్ వచ్చింది. డబ్బులు ఇస్తారా అని అడిగి, అవకాశం వస్తే చాలని ఆశతో అన్నపూర్ణ 7 ఎకర్స్‌లోని స్టూడియోకి వెళ్ళారు. అక్కడ 20 పేజీల స్క్రిప్ట్‌ను వెంటనే చదివి, ఓకే చేయడంతో లేడీ గెటప్ పాత్రలో ఆయన తొలిసారి స్టేజ్‌పై కనిపించారు. అప్పటి నుంచి ఆయన అదిరే అభి టీంలో వర్క్ చేస్తూ నటుడిగా ముందుకు సాగుతున్నాడు రాము.

Adhire Abhi Ramu

Adhire Abhi Ramu

Also Read: ఈ ఒక్క పని చేస్తే పిండి పురుగు అంతా మాడి మసైపోద్ది అంతే.. 

Follow Us