AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాపీ పనికి వెళ్ళేవాడిని.. అమ్మనాన్న గోనె సంచి పట్టుకొని వర్షంలో కూర్చునేవాళ్లు.. కన్నీళ్లుపెట్టుకున్న జబర్దస్త్ నటుడు

జబర్దస్త్ టీవీ షోలో పాల్గొని ఇప్పుడు తెలుగు సినిమాల్లో సత్తా చాటుతోన్న వారు చాలామందే ఉన్నారు. సుడిగాలి సుధీర్, బలగం వేణు, గెటప్‌ శీను, ఆటో రామ్ ప్రసాద్‌, ధనాధన్ ధన్ రాజ్, చలాకీ చంటి, ముక్కు అవినాష్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, ముక్కు అవినాశ్‌, శాంతి కుమార్‌ తదితర జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు డైరెక్టర్లుగా, హీరోలుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

తాపీ పనికి వెళ్ళేవాడిని.. అమ్మనాన్న గోనె సంచి పట్టుకొని వర్షంలో కూర్చునేవాళ్లు.. కన్నీళ్లుపెట్టుకున్న జబర్దస్త్ నటుడు
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 28, 2025 | 4:58 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు పడి సక్సెస్ అయినా వారే.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు అనుభవించింది ఆ తర్వాత అవకాశాలు అందుకొని సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ నటుడు కూడా తన జీవితంలో పడిన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నిజం చెప్పాలంటే ఈ షో ద్వారా చాలా మంది జీవితం మారిపోయింది. కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ అవకాశం రాక ముందు చాలా మంది ఎన్నో కష్టాలను చూశారు. కొంతమంది తినడానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడ్డామని కూడా చెప్పారు. తాజాగా ఓ జబర్దస్త్ నటుడు తన కష్టాలను గుర్తు చేసుకొని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

చదువు కుంటూనే పనులకు వెళ్లాను .. ఏడు నెలలు తాపీ పనికి వెళ్లాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జబర్దస్త్ నటుడు. అతను ఎవరో కాదు ఇమ్మానుయేల్. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇమ్మానుయేల్ జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తర్వాత ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొంటున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇమ్మానుయేల్ తన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మానుయేల్.

ఇది కూడా చదవండి :రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి

ఈ ప్రోమోలో ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..” నాకు మా ఊరంటే చాలా చాలా ఇష్టం.. మా ఊరి పేరు వైకుంఠపురం.. నా డిగ్రీ అయిపోయిన తర్వాత దాదాపు నేను ఒక ఏడు నెలలు తాపీ పనికి వెళ్లాను.. బొచ్చలు మోయడానికి వెళ్ళాను .. సిమెంట్ బొచ్చలు మోయడం వల్ల.. వేళ్లన్ని బొక్కలు పడితే ఏడ్చేసేవాడ్ని మా అమ్మ దగ్గర.. వర్షం పడితే నన్ను మా అన్నని పడుకోబెట్టి మా అమ్మనాన్న.. గోనె సంచులు పట్టుకొని కూర్చునేవాళ్లు.. మాకు ఎవరూ హెల్ప్ చేయలేదు.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యూల్. ఇమ్మాన్యూల్ మాట్లాడుతుంటే అక్కడ ఉన్నవారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీముఖి ఇమ్మాన్యూల్ దగ్గరకు తీసుకొని ఓదార్చింది ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.