KCR Movie: కేసీఆర్‌ పేరుతో సినిమా.. హీరోగా జబర్దస్త్ కమెడియన్‌.. మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

|

Oct 14, 2023 | 7:49 AM

బ‌జ‌ర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ కమెడియన్లలో రాకింగ్ రాకేష్‌ ఒకరు. ఈ షోలో మొదట ఒక చిన్న కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అతను తనదైన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తున్నాలో. తన కామెడీ ట్యాలెంట్‌తో జబర్దస్త్‌ షోలో టీమ్‌ లీడర్‌గా కూడా ఎదిగాడు. ఇప్పుడు ఏకంగా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనున్నాడు రాకింగ్‌ రాకేష్‌. అది కూడా కేసీఆర్‌ టైటిల్‌తో. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

KCR Movie: కేసీఆర్‌ పేరుతో సినిమా.. హీరోగా  జబర్దస్త్ కమెడియన్‌.. మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
KCR Movie, Rocking Rakesh
Follow us on

బ‌జ‌ర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ కమెడియన్లలో రాకింగ్ రాకేష్‌ ఒకరు. ఈ షోలో మొదట ఒక చిన్న కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అతను తనదైన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తున్నాలో. తన కామెడీ ట్యాలెంట్‌తో జబర్దస్త్‌ షోలో టీమ్‌ లీడర్‌గా కూడా ఎదిగాడు. ఇప్పుడు ఏకంగా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనున్నాడు రాకింగ్‌ రాకేష్‌. అది కూడా కేసీఆర్‌ టైటిల్‌తో. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా కేసీఆర్‌ సినిమా లాంఛ్‌ జరిగింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగులు కటౌట్‌తో సుమారు రూ.50,000 స్టూడెంట్స్‌ సమక్షంలో టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. తెలంగాణ ప్రాంతం బంజారా (తాండ) నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ను లాక్‌ చేసింది మూవీ యూనిట్‌. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ మామిడి హరికృష్ణతో పాటు సినిమా యూనిట్ మొత్తం పాల్గొన్నారు.

కేసీఆర్‌ పేరుతో రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో కేసీఆర్ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే లుక్ చూస్తుంటే ఆయనదేనని అనిపిస్తుంది. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య హీరోయిన్‌గా నటిస్తుండగా, తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్‌ సీనియర్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ధనరాజ్, తాగుబోతు రమేష్, రచ్చ రవి, జోర్దార్ సుజాత, కనకవ్వ, రైజింగ్ రాజు, సన్నీ, ప్రవీణ్, లోహిత్ తదితరులు వివిధ పాత్రల్లో మెరవనున్నారు. కేసీఆర్‌ సినిమాకు చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. అలాగే గరుడ వేగ అంజి డీవోపీగా వ్యవహరిస్తుండగా, బలగం మధు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మరి ఈ సినిమా కేసీఆర్‌ కు సంబంధించినదా? లేకపోతే హైప్‌ కోసం ఈ టైటిల్‌ పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మంత్రి మల్లారెడ్డితో రాకింగ్ రాకేష్..

కేసీఆర్ టైటిల్ తో సినిమా..

జబర్దస్త్ టీమ్ మేట్స్ తో రాకింగ్ రాకేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..