AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Pavithra: హైదరాబాద్‌లో 8 నెలలు ఎలాంటి పని దొరకలేదు.. ఆమెనే నాకు అండగా నిలిచింది: జబర్దస్త్ పవిత్ర

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర రీసెంట్ గా ఒక టాక్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుని ఎమోషనలైంది.

Jabardasth Pavithra: హైదరాబాద్‌లో 8 నెలలు ఎలాంటి పని దొరకలేదు.. ఆమెనే నాకు అండగా నిలిచింది: జబర్దస్త్ పవిత్ర
Jabardasth Actress Paagal Pavithra
Basha Shek
|

Updated on: Sep 04, 2026 | 8:05 AM

Share

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో పాగల్ పవిత్ర ఒకరు. అందులో తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే చేరువైందీ అందాల తార. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ వంటి టీవీ షోస్, రియాలిటీ షోల్లోనూ సందడి చేస్తోంది పవిత్ర. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఇలా ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో తీరిక లేకుండా తీరికి లేకుండా బిజీ బిజీగా ఉంటోన్న పవిత్ర రీసెంట్ గా ఒక టాక్ షోకు హాజరైంది. జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ జబర్దస్త్ కమెడియన్. అలాగే వివిధ సందర్భాల్లో తాను ఎదుర్కొన్ని ఇబ్బందులు, కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ‘ నటిగా మంచి గుర్తింపు వచ్చాక కూడా నేను కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక సమయంలో ఒక ఛానల్ ఒక షో చేస్తున్న సమయంలో నాకు మరొక ఛానల్ నుంచి ఇంకొక అవకాశం వచ్చింది. ఇలా ఆ ఛానల్ నుంచి అవకాశం వచ్చినట్టు సదురు షో యాజమాన్యంతో మాట్లాడి వారి అనుమతి తీసుకొని వేరే ఛానల్ లో ప్రసారమవుతున్న కార్యక్రమంలో పాల్గొన్నాను. అయితే ఆ టీవీ షోలో పాల్గొన్నందుకు ఉన్నఫళంగా నన్ను షో నుంచి తప్పించారు. అలా దాదాపు 8 నెలల పాటు నాకు ఎలాంటి షోలు లేకపోవడంతో నరకం అనుభవించాను’

‘హైదరాబాదు లాంటి నగరంలో 8 నెలల పాటు ఎలాంటి పని లేకుండా ఉండడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలోనే నాకు ప్రవీణ్ అక్క అండగా నిలిచారు. ఆమె నాకు రెండో అమ్మతో సమానం’ అంటూ అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంది పవిత్ర. ఇక తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ కామెంట్లపై కూడా మాట్లాడింది పవిత్ర. ‘నా స్నేహితులే నన్ను తీవ్రంగా అవమానించారు. అందులో నాతో కలిసి తిరిగిన అమ్మాయిలే నన్ను నల్లగా ఉన్నానని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. అందుకే నా జీవితంలో ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెంట్ కాదని అనుకుంటున్నాను. ఈ కారణంగానే ఎవరితోనూ నేను పెద్దగా మాట్లాడటం లేదు’ అని పవిత్ర చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

యాంకర్ రవితో జబర్దస్త్ పవిత్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us