రవితేజ, త్రినాధ రావు మూవీ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మాస్ మాహారాజాకు జోడిగా ఆ ఇద్దరు హీరోయిన్లు..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్లో 'ఖిలాడి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ సరసన మీనాక్షి చౌదరి,

  • Rajitha Chanti
  • Publish Date - 12:05 pm, Tue, 23 February 21
రవితేజ, త్రినాధ రావు మూవీ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మాస్ మాహారాజాకు జోడిగా ఆ ఇద్దరు హీరోయిన్లు..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్లో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఖిలాడి మూవీని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే రవితేజ తన 68వ సినిమాను నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

రవితేజ.. త్రినాధ రావు కాంబోలో తెరకెక్కే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లుగా సమాచారం. మాస్ మాహారాజాకు జోడీగా మలయాళ నటి ఈశ్వర్య మీనన్, కన్నడ బ్యూటీ శ్రీలీల నటించనున్నట్లుగా సమాచారం. లవ్ ఫెయిల్యూర్, పెళ్లి సందడి తర్వాత ఐశ్వర్య, శ్రీలీల ఇద్దరికీ ఇది రెండవ టాలీవుడ్ ప్రాజెక్ట్ కానుంది. పీపీ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు సహా నిర్మాతగా వివేక్ కుచిబోట్ల వ్యవహరించనున్నారు.

Also Read:

తెలుగులో సందడి చేయనున్న ‘సూపర్ డీలక్స్’.. డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేసిన ఆ నిర్మాణ సంస్థ..