తెలుగులో సందడి చేయనున్న ‘సూపర్ డీలక్స్’.. డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేసిన ఆ నిర్మాణ సంస్థ..
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఇటు తెలుగులో విడుదలైన ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.
Super Deluxe Movie: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఇటు తెలుగులో విడుదలైన ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో విజయ్ ‘రాయనం’ పాత్రలో నటించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతూనే విజయ్ తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా సూపర్ డీలక్స్. విభిన్న కథల సమాంతరంగా సాగిన ఈ సినిమాలో సమంత, ఫాహద్, రమ్యకృష్ణ, మిస్కిన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలవడమే కాకుండా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇందులో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగులో అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సిద్ధేశ్వర వైష్ణవి ఫిల్మ్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈమూవీ డబ్బింగ్ పనులు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ సాధించనుందా లేదా అనేది చూడాలి.
Also Read: