Allu Arjun: పుష్ప కోసం అల్లు అర్జున్ ఎంతలా కష్టపడుతున్నాడో తెలుసా.. రోజుకు రెండు గంటలు మేకప్‌కే సరిపోతుంది..
Allu Arjun Spending 4 Hours For Makeup: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై...
Allu Arjun Spending 4 Hours For Makeup: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో తొలిసారి కన్నడ బ్యూటీ రష్మిక బన్నీ సరసన నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ లారీ క్లీనర్ పాత్రలో నటించనున్నాడనే విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో తన మేకోవర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్న బన్నీ ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల్లో బన్నీ తన స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇదిలా ఉంటే అసలైన క్లీనర్‌గా కనిపించేందుకు ఏకంగా రోజుకు రెండు గంటలు మేకప్ కోసమే సమయాన్ని కేటాయిస్తున్నాడట. కను బొమ్మల నుంచి మొదలు పెడితే.. మీసాలు, జుట్లు వరకు ప్రతీది సహజంగా కనిపించేలా చూసుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఆర్య, ఆర్య-2 చిత్రాలలో స్టైలిష్ లుక్‌లో కనిపించిన బన్నీని ‘పుష్ప’లో మాత్రం పూర్తిగా మాస్ లుక్‌లో చూపిస్తున్నాడు. ఇక ‘పుష్ప’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని తెన్‌కాశీలో జరుగుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.