Drishyam 2: హిందీలో రెండో దృశ్యం చూపించనున్నారు.. దర్శకుడు మరణించాడుగా.. మరి ఎవరు తెరకెక్కిస్తారు.?

Drishyam 2 Bollywood Remake: మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన 'దృశ్యం' సినిమా యావత్‌ భారతీయ సినీ ప్రేక్షకులను ఆకర్షించింది. ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఓ మధ్య తరగతి కుటుంబంలో అనుకోని..

Drishyam 2: హిందీలో రెండో దృశ్యం చూపించనున్నారు.. దర్శకుడు మరణించాడుగా.. మరి ఎవరు తెరకెక్కిస్తారు.?
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 23, 2021 | 11:08 AM

Drishyam 2 Bollywood Remake: మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమా యావత్‌ భారతీయ సినీ ప్రేక్షకులను ఆకర్షించింది. ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఓ మధ్య తరగతి కుటుంబంలో అనుకోని సంఘటన కారణంగా కష్టాలు ఎదురైతే ఆ కుటుంబం పెద్ద.. తన వారిని ఎలా కాపాడుకున్నాడన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జీతూ జోసెఫే దర్శకత్వం వహించిన ఈ సినిమాను పూర్తిగా ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ మలయాళంలో విడుదలైన విషయం తెలిసిందే. దృశ్యం ఏ స్థాయిలో విజయం సాధించిందో దానికి రెట్టింపు సక్సెస్‌ను అందుకుందీ సినిమా. దేశవ్యాప్తంగా మంచి బజ్‌తో దూసుకెళోతున్న ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో ఇతర భాషల్లోనూ దృశ్యం సీక్వెల్‌ తెరకెక్కనున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో వెంకీ హీరోగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక హిందీలోనూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దృశ్యం హిందీ వెర్షన్‌లో నటించిన అజయ్‌ దేవ్‌గణ్‌ సీక్వెల్‌లోనూ నటించనున్నాడని సమాచారం. ఇక టబూ, శ్రేయ కొనసాగుతారా? లేదా చూడాలి. ఇదిలా ఉంటే హిందీ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన నిషికాంత్‌ కామంత్‌ గతేడాది అనారోగ్యం కారణంగా మరణించాడు. దీంతో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేయనున్నాడన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వార్త ప్రకారం ఈ చిత్రాన్ని సినిమా మాతృక దర్శకుడు జీతూ జోసఫ్‌ హిందీ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాలి.

Also Read: తారక్‌కు విలన్‌గా సేతుపతి.. అన్నీ కుదిరితే రేర్ కాంబో.. రికార్డులు బద్దలు కావడం ఖాయం.!