వీడు పూరి మార్క్ మసాలా.. ‘ఇస్మార్ట్ శంకర్’
పూరి జగన్నాథ్..హీరోని చూపించాలంటే, ఎలివేట్ చెయ్యాలంటే టాలీవుడ్‌లోని అతి కొద్ది మంది దర్శకులలో ఈయన ఒకరు. హీరోకి ఒక టిపికల్ యాటిట్యూడ్‌ని క్రియేట్ చేసి, బాడీ లాంగ్వేజ్‌లో ఛేంజెస్ చేసి, పక్కా మాస్ భాషలో డైలాగ్స్ చెప్పిస్తూ టాకీస్‌లో రచ్చ చేయిస్తుంటాడు. పూరీ సినిమాలు ఫ్లాఫ్ అయ్యిండొచ్చు కానీ పూరీ లేదా అతని హీరోలు ఎప్పుడూ ప్లాప్ అవ్వలేదనే చెప్పుకోవాలి. అందుకే వరస ప్లాపుల్లో ఉన్నా కానీ పూరీతో సినిమా అనగానే స్టార్ హీరోలు సైతం డేట్స్ […]
పూరి జగన్నాథ్..హీరోని చూపించాలంటే, ఎలివేట్ చెయ్యాలంటే టాలీవుడ్‌లోని అతి కొద్ది మంది దర్శకులలో ఈయన ఒకరు. హీరోకి ఒక టిపికల్ యాటిట్యూడ్‌ని క్రియేట్ చేసి, బాడీ లాంగ్వేజ్‌లో ఛేంజెస్ చేసి, పక్కా మాస్ భాషలో డైలాగ్స్ చెప్పిస్తూ టాకీస్‌లో రచ్చ చేయిస్తుంటాడు. పూరీ సినిమాలు ఫ్లాఫ్ అయ్యిండొచ్చు కానీ పూరీ లేదా అతని హీరోలు ఎప్పుడూ ప్లాప్ అవ్వలేదనే చెప్పుకోవాలి. అందుకే వరస ప్లాపుల్లో ఉన్నా కానీ పూరీతో సినిమా అనగానే స్టార్ హీరోలు సైతం డేట్స్ ఇచ్చేస్తున్నారు.
తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ రోజు రామ్ బర్త్ డే సందర్భంగా చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. తన మేకింగ్ స్టైల్‌ని, హీరో కరేజ్‌ని మరోసారి ఎక్స్‌ఫోజ్ చేశాడు పూరీ జగన్నాథ్. రామ్ కూడా డైలాగ్ డెలివరీతో, ఇంటెన్సివ్ యాక్టింగ్‌తో ఇరగగొట్టాడు. ఎన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో వారెవ్వా అనిపించాడు.
థీమ్ సాంగ్ రూపంలో మణిశర్మ పనితనం బాగా వినిపించింది. బర్త్ డే టీజర్ కాబట్టి హీరో తప్ప హీరొయిన్లతో సహా ఇంకే పాత్ర రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తానికి రామ్ ఫాన్స్ తో పాటు పూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా ఇస్మార్ట్ శంకర్ టీజర్ తోనే మంచి బోణీ కొట్టేసింది. విడుదల తేది ఇంకా ఖరారు కావాల్సిన ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరొయిన్లుగా నటిస్తున్నారు.