Kushi: ఖుషి మూవీ ఓటీటీ డీల్ సెట్ అయ్యిందా..? స్ట్రీమింగ్ ఎందులో అంటే..!
దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండ ఈ మూవీతో హిట్ అందుకున్నాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అందమైన ప్రేమ కథగా తెరకెక్కింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇక సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా శివ నిర్వాణ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఈ సినిమాలో సమంత, విజయ్ కెమిస్ట్రీ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. చివరిగా వచ్చిన లైగర్ సినిమా నిరాశపరచడంతో ఈ సినిమా పై విజయ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ కోరుకున్నట్టే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
![Kushi: ఖుషి మూవీ ఓటీటీ డీల్ సెట్ అయ్యిందా..? స్ట్రీమింగ్ ఎందులో అంటే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/kushi-1.jpg?w=1280)
విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ నిర్వాణం దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండ ఈ మూవీతో హిట్ అందుకున్నాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అందమైన ప్రేమ కథగా తెరకెక్కింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇక సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా శివ నిర్వాణ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఈ సినిమాలో సమంత, విజయ్ కెమిస్ట్రీ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. చివరిగా వచ్చిన లైగర్ సినిమా నిరాశపరచడంతో ఈ సినిమా పై విజయ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ కోరుకున్నట్టే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ శాటిలైట్ లైట్స్, డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్. ఇదిలా ఉంటే ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది అన్నదాని పై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఇప్పటిలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు కొందరు.
View this post on Instagram
ఖుషి సినిమా ఓటీటీ రైట్స్ పై గట్టి పోటీ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ మూవీ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ పోటీలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ ఖుషి ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తుంది.
View this post on Instagram
ఫ్యాన్సీ రేటుతో ఖుషి మూవీని నెట్ ఫిక్స్ సొంతం చేసుకుందట. ఖుషి సినిమా రిలీజ్ అయిన 30 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ సెట్ అయ్యిందని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.