Samantha Ruth Prabhu: మయోసైటిస్ నుంచి బయటపడేందుకు సామ్ ఇలా చేస్తుందట..?

|

Nov 26, 2022 | 12:31 PM

సమంత తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నా అని చెప్పిన విషయం తెలిసిందే. సమంత మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతోంది.కొద్దిరోజుల క్రిత్రం తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Samantha Ruth Prabhu: మయోసైటిస్ నుంచి బయటపడేందుకు సామ్ ఇలా చేస్తుందట..?
Samantha
Follow us on

స్టార్ హీరోయిన్ సమంత గురించి రోజు ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా సామ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నా అని చెప్పిన విషయం తెలిసిందే. సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది.కొద్దిరోజుల క్రిత్రం తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదొక ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ త్వరగానే కోలుకుంటాను అను సమంత రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే చాలా మంది సెలబ్రెటీలు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు షేర్ చేశారు. సామ్ కు వచ్చిన వ్యాధి పేరు మయోసైటిస్. ఈ వ్యాధి సోకినా వారికి కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం సమంత ఇదే సమస్యతో బాధపడుతోంది.

అయితే సామ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది అని సామ్ మ్యానేజర్ తెలిపారు. సమంత పై వస్తున్న వార్తలు నమ్మొద్దని తనకు కోలుకుంటుందని చెప్పుకొచ్చారు సామ్ మ్యానేజర్. ఇక తాజాగా సమంత ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోనుందన్న టాక్ వినిపిస్తుంది. లోకల్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర సమంత చికిత్స తీసుకుంటుందని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న సామ్.. ఇంటిదగ్గర ఉండే ఆయుర్వేదిక్ చికిత్స తీసుకుంటుందని అంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునేలా ఈ చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక సామ్ రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా శాకుంతలం అనే సినిమాలో కూడా నటిస్తుంది సామ్. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..