బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan) తెలియని వారు ఉంటారా..? అవ్వడానికి బాలీవుడ్ అమ్మడే అయినా అన్ని భాషల్లో ఈ ముద్దుగుమ్మకు భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ఐశ్వర్య బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు చాలా తగ్గించింది. అడపా దడపా మాత్రమే సినిమాల్లో కనిపించింది ఈ బ్యూటీ. అప్పట్లో రజినీకాంత్ నటించిన రోబో సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆతర్వాత రణబీర్ కపూర్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో నటించి ఆకట్టుకుంది ఐష్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరోసారి తల్లి కాబోతుందన్న వార్త బీటౌన్లో జోరుగా వినిపిస్తోంది. అభిషేక్, ఐశ్వర్య రాయ్ లకు ఇప్పటికే ఆద్య అనే పాప ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐష్ మరో బిడ్డకు జన్మనివ్వనుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఇటీవల ఐశ్వర్య.. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చారు. దాంతో వారు మీడియా కంటపడ్డారు. వెంటనే మీడియా కెమెరాలు ఈ జంటను క్లిక్ మనిపించాయి. అయితే ఈ ఫొటోల్లో ఐష్ కడుపు భాగం ఎత్తుగా కనిపించడం తో ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ప్రగ్నెన్సీను కవర్ చేయడానికి ప్రయత్నించినట్లు అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్ ధరించుకున్న ఐశ్వర్య కడుపు కొంచెం పెద్దగా కనిపించడంతో ఆమె రెండోసారి తల్లికాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య డ్రెస్సు, ఆమె నడక చూస్తుంటే కచ్చితంగా ప్రెగ్నెంట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
Is Aishwarya Rai Bachchan pregnant? Viral videos, pictures spark speculations
Read @ANI Story | https://t.co/jeCE6Ilkqi#AishwaryaRai #AishwaryaRaiBachachanPregnant #AbhishekBachchan #Bollywood pic.twitter.com/Lzf58ir3qE
— ANI Digital (@ani_digital) July 20, 2022