NTR 30: తారక్, కొరటాల శివ సినిమా స్టోరీ ఇదేనా..? సైఫ్‌ను అలా చూపించనున్నారా..
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ తో ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సముద్రం బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ ఉండనుందని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి జాన్వీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ తారక్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ తో ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సముద్రం బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ ఉండనుందని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి జాన్వీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ విషయాన్నీ ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో యాక్షన్ సీన్లు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో సైఫ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడట సైఫ్.
కొండల్లో గ్యాంగ్ తో నివశించే క్రూరమైన వ్యక్తి పాత్రలో సైఫ్ నటించనున్నాడని టాక్. కొండ ప్రాంతంలో ఉండే అమాయక ప్రజలను హింసిస్తూ ఉంటాడని అతడి అరాచకాలను అడ్డుకోవడానికి ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడని టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుందని తెలుస్తోంది. సైఫ్, తారక్ మధ్య సీన్స్ పోటాపోటీగా ఉంటాయట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.