pawan kalyan vakeel saab: మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా వకీల్ సాబ్. కోవిడ్ ఫియర్స్ మధ్యే రిలీజ్ అయినా.. వకీల్ సాబ్‌కు ఘనవిజయాన్ని కట్టబెట్టారు ఫ్యాన్స్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తీసినిమా తెరకెక్కింది. రీమేక్ సినిమానే అయినా.. పవన్ మేనరిజమ్స్‌కు మరోసారి మెస్మరైజ్ అయ్యారు ఫ్యాన్స్. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ అన్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ముగ్గురు అమ్మాయిలను కాపాడే ఓ లాయర్ కథే వకీల్ సాబ్. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారన్నది ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న నయా అప్‌డేట్. మరో సెన్సేషనల్ పాయింట్ నేపథ్యంలో పవర్ ఫుల్ లాయర్‌గా పవన్‌ను ప్రజెంట్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారన్న న్యూస్ ఫిలిం నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సినిమా మేకింగ్ సమయంలోనో.. ప్రమోషన్ సమయంలోనూ యూనిట్… సీక్వెల్ ఉంటుందన్న హింట్ కూడా ఇవ్వలేదు. అంతేకాదు పవన్ డేట్స్ కూడా ఇప్పట్లో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ సీక్వెల్ ఉంటుందా..? అంటే అనుమానామే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
మరిన్ని ఇక్కడ చదవండి :