Allu Arjun: పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తర్వాత ఐకాన్ స్టార్ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు..?

స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ప్రమోట్‌ అయిన అల్లు అర్జున్‌... ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Allu Arjun: పాన్ ఇండియా మూవీ 'పుష్ప' తర్వాత ఐకాన్ స్టార్ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు..?
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2021 | 11:17 AM

Allu Arjun: స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ప్రమోట్‌ అయిన అల్లు అర్జున్‌… ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజెంట్ పుష్ప పనుల్లో ఉన్న బన్నీ, నెక్ట్స్ మూవీ ఎవరితో అన్న డిస్కషన్ మొదలైంది. కొరటాల శివతో అనౌన్స్‌ అయిన మూవీ ఇప్పట్లో లేకపోవడంతో బన్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో అన్నది ఆసక్తికరంగా మారింది. మిగతా హీరోలంతా… క్రేజీ మూవీస్‌ లైనప్ చేస్తుంటే బన్నీ నెక్ట్స్ మూవీ డైరెక్టర్‌ ఎవరు? ఇదే ఇప్పుడు ఫిలిం నగర్‌లో మేజర్‌ డిస్కషన్‌. ఆల్రెడీ పుష్ప షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ఈ టైంలో కోవిడ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవటంతో ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు బన్నీ. పుష్ఫ షూటింగ్ స్టార్ట్ అయిన టైంలోనే నెక్ట్స్ కొరటాల శివతో సినిమా అంటూ అనౌన్స్ చేశారు అల్లు అర్జున్‌. కానీ సడన్‌గా కొరటాల ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసి ఎన్టీఆర్‌తో సినిమా కమిట్ అయ్యారు. దీంతో బన్నీ మరో డైరెక్టర్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ టైంలోనూ లాంగ్‌ బ్యాక్‌ అనౌన్స్‌ అయిన ఐకాన్ సినిమా తెర మీదకు వచ్చింది. వకీల్ సాబ్ సూపర్ హిట్ కావటంతో వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఐకాన్‌ ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్‌నీల్‌తోనూ అల్లు అర్జున్ సినిమా అన్న న్యూస్‌ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. ప్రజెంట్ ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ ఈ మధ్య గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో బన్నీని కలిశారు. అప్పటి నుంచే అల్లు అర్జున్‌తో ప్రశాంత్ మూవీ అన్న ప్రచారం మొదలైంది. కేజీఎఫ్‌ లాంటి సినిమానే జెట్ స్పీడుతో పూర్తి చేసిన ప్రశాంత్..‌ సలార్‌ను కూడా అక్టోబర్ నాటికి కంప్లీట్‌ చేసేసి బన్నీతో మూవీ స్టార్ట్ చేస్తారని భావిస్తున్నారు. తాజాగా బన్నీ లిస్ట్‌లోకి మరో స్టార్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చారు. కోలీవుడ్‌లో వరుస బ్లాక్ బస్టర్స్‌ ఇస్తున్న మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారన్నది టాలీవుడ్ నయా అప్‌డేట్‌. సోషల్ మేసేజ్‌ను కమర్షియల్ వేలో ప్రజెంట్ చేసే మురుగదాస్… బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను సిద్ధం చేశారట. మరి ఈ సినిమాల్లో బన్నీ ఓకే చేయబోయే సినిమా ఏది..? ఈ విషయంలో క్లారిటీ కోసమే ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nayanthara: ఓటీటీ లో రానున్న లేడీ సూపర్ స్టార్ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు నయన్ ‘నిజల్’

Actor Siddharth : బీజేపీ నేత ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సిద్ధార్థ్.. ‘ఏరా.. సిగ్గుండాలి’ అంటూ..

Actress Meena: బాలయ్య సరసన మరోసారి నటించనున్న అందాల సీనియర్ నటి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!