AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో కాదా..? ఆ స్టార్ హీరోతో చేయనున్న స్టార్ డైరెక్టర్

పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జు ఎవరితో సినిమా చేయనున్నారన్నఆసక్తి అభిమానుల్లో నెలకొంది.. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో ఉంటుందని టాక్ వినిపించింది. సౌత్ స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అట్లీ వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే బాలీవుడ్ జవాన్ సినిమా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

Allu Arjun: అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో కాదా..? ఆ స్టార్ హీరోతో చేయనున్న స్టార్ డైరెక్టర్
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2024 | 6:04 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఇప్పుడు పుష్ప 2 కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జు ఎవరితో సినిమా చేయనున్నారన్నఆసక్తి అభిమానుల్లో నెలకొంది.. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో ఉంటుందని టాక్ వినిపించింది. సౌత్ స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అట్లీ వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే బాలీవుడ్ జవాన్ సినిమా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ అని తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని ఇప్పటికే ఊహించేసుకుంటున్నారు.

అయితే అల్లు అర్జున్ సినిమానుంచి అట్లీ డ్రాప్ అయ్యాడని తెలుస్తోంది. కాగా అట్లీ మరోసారి బాలీవుడ్ హీరోతో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. అట్లీ తన నెక్స్ట్ సినిమా కోసం సల్మాన్ ఖాన్‌ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ కోసం అనుకున్న కథనే సల్మాన్ తో చేస్తున్నాడా లేక సల్మాన్ కోసం సపరేట్ స్టోరీ రాసుకున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.  అయితే అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి కారణం ఇదే అంటూ మరో వార్త కూడా వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ నిర్మాత నుండి 80 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు టాక్. దాంతో నిర్మాతలు అట్లీ కోసం అంత ఇచ్చుకోలేం అనడంతో అట్లీ బాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సల్మాన్ కు అట్లీ లైన్ వినిపించాడని. స్క్రీప్ట్ వర్క్ కూడా  మొదలు పెట్టేశాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేస్తారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సల్మాన్ ‘సికిందర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అట్లీ సినిమాఉండనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!