Kushi: విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా.?
విజయ్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు. డియర్ కామ్రేడ్ సినిమా పర్లేదు అనిపించుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి.
![Kushi: విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/kushi.jpg?w=1280)
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు. డియర్ కామ్రేడ్ సినిమా పర్లేదు అనిపించుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా విజయ్ కు హిట్ కావాలి అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా ఖుషి. టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. మొన్నామధ్య ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకున్నారు. ఖుషి సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటిస్తోన్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా కథలో ఇప్పుడెయ్ మార్పులు చేర్పులు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. మొన్నామధ్య సమంత అనారోగ్యానికి గురికావడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ.
మొన్నటివరకు ఇదే అనుకున్నారు అంతా.. రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అలానే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కంప్లీట్ లవ్ స్టోరీగా కాకుండా కాస్త యాక్షన్ సీన్స్ కూడా జోడిస్తున్నారని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ కోసం పీటర్ హెయిన్స్‌ను రంగంలోకి దింపడంతో ఇప్పుడు రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మార్చి 8 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారట. ఆ రోజు సమంత కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వనుందని తెలుస్తోంది.