AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GAMA Awards 2025: దుబాయ్‌లో గ్రాండ్‌గా జరగనున్న గామా అవార్డ్స్ 2025

ఫిబ్రవరి 16, 2025న గామా అవార్డ్స్ 2025,  5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ అజ్మాన్, దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని, గామా ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. మొట్టమొదటి సరిగా, సరికొత్తగా, వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించారు. ⁠

GAMA Awards 2025: దుబాయ్‌లో గ్రాండ్‌గా జరగనున్న గామా అవార్డ్స్ 2025
Gama 2025
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2025 | 3:34 PM

Share

ఫిబ్రవరి 16, 2025న గామా అవార్డ్స్ 2025,  5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ అజ్మాన్, దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని, గామా ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. మొట్టమొదటి సరిగా, సరికొత్తగా, వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించారు. ⁠ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు శ్రీ రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ డేట్ ను వేదికను అలాగే జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. GAMA అవార్డ్స్ 2025,  5వ ఎడిషన్ జూన్ 7, 2025, దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించనున్నారు. జ్యూరీ చైర్ పర్సన్స్  ప్రముఖ సినీ దర్శకులు కొదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకుడు కోటి అలాగే ప్రముఖ సినీ దర్శకుడు బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు  GAMA అవార్ద్స్ అందించనున్నారు.

ఈ ప్రత్యేకమైన వినూతన రీతిలో ప్రెజెంటేషన్ ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ అందరికీ అద్భుత అనుభూతిని కలిగించేలా అనౌన్స్‌మెంట్‌ను చేసారు. గామా అవార్డ్స్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త  కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్న గామా, ఇప్పుడు 2025 జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్ కు ప్రముఖ సినీ పెద్దలను,కళాకారులను విశిష్ట అతిధులుగా  ఆహ్వానించ దలిచారని UAE లోని  తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలుగు సినీ ప్రముఖులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. UAE ఈ  కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి తెలుగు వారికి ధన్యవాదములు తెలియజేసారు.

గామా అవార్డ్స్ CEO సౌరభ్ కేసరి మాట్లాడుతూ.. గామా అవార్ద్స్ కు వినూత్నంగా అత్యంత వినోదభరితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి గామా అవార్డ్స్ ఇచ్చి సత్కరించనున్నారని తెలియజేసారు. ఇప్పటికే సినీ ప్రముఖులను ఆహ్వానించడం జరిగిందని తెలియజేసారు.  నామినేటెడ్ అయిన విభాగాలకు, పబ్లిక్ ఓటిండింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తామని తెలియజేసారు. ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించేందుకు గామా అవార్డ్స్ ఎంత ముఖ్యమైన వేదికగా నిలుస్తుందో వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారందరు గామా అవార్ద్స్ 2025, విజవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారందరు  ఇంత అద్బుతమైన ఇటువంటి కార్యక్రమం  UAE లో జరగడం తెలుగు వారందకీ చాలా గర్వముగా ఉందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే కుంచె రఘు గారు మాట్లాడుతూ..  తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ ఈ గామా ఈవెంట్ అని అన్నారు. గామాతో మాకు చాలా మంచి అనుబంధం ఉందని అన్నారు. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటారు అని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us