Nandamuri Balakrishna: నటసింహం ఆ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయనున్నారా..?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK 107. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Nandamuri Balakrishna: నటసింహం ఆ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయనున్నారా..?
Balakrishna

Edited By:

Updated on: Jul 21, 2022 | 7:38 AM

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK 107. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అఖండ సినిమా తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అటు క్రాక్ సినిమాతో  బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. చాలా కాలం తర్వాత మాస్ రాజా రవితేజ తో కలిసి చేసిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాలయ్య , గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అటు అభిమానులలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే టర్కీ నుంచి షూటింగ్ కంప్లీట్ చేసుకున్న NBK 107 టీమ్ తాజాగా కర్నూల్ లో సందడి చేస్తున్నారు. కర్నూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా కనిపించనున్నారని గుసగుసలాలి వినిపించాయి. క్రాక్ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన రవితేజను ఈ సినిమాలో చిన్న పాత్ర చేయాలనీ కోరారట. దానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా బాలయ్య, రవితేజ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయనున్నారని. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారని అంటున్నారు. మొన్నామధ్య అన్ స్టాపబుల్ షోలో బాలయ్య, రవితేజ మధ్య బాండింగ్ చూసి, ఇద్దరి క్యారెక్టర్స్ దగ్గరదగ్గరగా ఉండటంతో దర్శకుడు గోపీచంద్ ఓ మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచనకు వచ్చారని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త నిజమైతే బాగుండు అని అటు మాస్ రాజా ఫ్యాన్స్, ఇటు బాలయ్య అభిమానులు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి