సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన కళావతి పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ పాటకు 20 మిలియన్ వ్యూస్ రావడమంటే అతిశయోక్తి కాదు.. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత మహేష్.. త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.
ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రావాల్సిన చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక దీంతోపాటు.. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత వీరిద్దరి కాంబో పట్టాలెక్కనుంది. తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మహేష్ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నాడట. మహేష్ ఇమేజ్ కు తగ్గట్లుగా.. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా.. మహేష్ అభిమానుల ఎలా అయితే కోరుకుంటున్నారో.. అలా చూపించేందుకు విజయేంద్ర ప్రసాద్ పలు స్టోరీ లైన్స్ సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ లైన్ మహేష్ బాబుకు నచ్చడంతో ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్.. జక్కన్న కజిన్ ఈ స్టోరీని రెడీ చేస్తున్నారని వినికిడి.
అయితే మహేష్, రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ హీరో ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో ఆ స్టార్ హీరో ఓ అర్థ గంటపాటు కనిపిస్తాడని… ఈ చిత్రాన్ని మల్టీస్టారర్ గా తెరకెక్కించేందుకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారట.
Also Read: Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..
Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్‌గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..
Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..