AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Movie: ‘దేవర’ సినిమాకు ముందు అనుకున్న హీరో అతడేనా..?

నిన్న విడుదలైన దేవర మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సంచనలం సృష్టిస్తుంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. అన్ని భాషలలోనూ ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న

Devara Movie: 'దేవర' సినిమాకు ముందు అనుకున్న హీరో అతడేనా..?
Devara
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2024 | 4:50 PM

Share

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో నిన్న విడుదలైన దేవర మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సంచనలం సృష్టిస్తుంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. అన్ని భాషలలోనూ ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్టులో బీటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో దేవర సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. #AA21 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందించనున్న తెలిపారు. యువసుధా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయని ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే 2020లో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రాగా.. ఇప్పటివరకు మరో అప్డేట్ రాలేదు. పుష్ప చిత్రీకరణ అనంతరం కొరటాల శివ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు అంతా.

ఇవి కూడా చదవండి

కానీ ఆ తర్వాత పుష్ప 2 ప్రాజెక్టులో అల్లు అర్జున్ బిజీ కావడం.. మరోవైపు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ కావడంతో వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీంతో కొరటాల శివ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అల్లు అర్జున్, కొరటాల శివ కాంబోలో రావాల్సిన ప్రాజెక్ట్ దేవర అని.. కానీ పుష్ప 2 సినిమాతో బన్నీ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ తారక్ వద్దకు వెళ్లిందని .. అప్పట్లో బన్నీ రిలీజ్ చేసిన థీమ్ పోస్టర్.. దేవర ట్రైలర్ కు చాలా దగ్గరగా ఉందనే టాక్ నడుస్తుంది. దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..