Allu Arjun’s Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన హ్యాట్రిక్ మూవీ ఇది. బన్నీ – సుకుమార్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆర్య,ఆర్య 2 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమా భారీ విజయాన్ని ఆదుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ విన్న పుష్ప సినిమా పాటలే. ఎక్కడ చుసిన పుష్ప సినిమా డైలాగులే..ఇక పుష్ప సినిమా భారీ విజయాన్ని మాత్రమే కాదు రికార్డు కలెక్షన్స్ ను కూడా సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా ఊర మాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ కనబరిచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక పుష్ప సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు , సినిమా తారలు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. మరో వైపు పుష్ప పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే పార్ట్ 1 భారీ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు పార్ట్ 2 పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే పుష్ప ది రూల్ గురించిన ఓ వార్త .ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ”పుష్ప: ది రూల్” చిత్రంలో ఓ ట్విస్ట్ ఉంటుందని ఇప్పుడు ఓ క్రేజీ గాసిప్ వైరల్ అవుతోంది. మొదటి భాగంలో హీరో పక్కన ఉండే కేశవాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే రెండో భాగంలో కేశవా పుష్పకు వెన్ను పోతూ పొడుస్తాడని దాంతో హీరో కొత్త చిక్కుల్లో పడతాడని టాక్ నడుస్తుంది. అదే సమయంలో .మొదటి పార్ట్ లో విలన్స్ గా చూపించిన జల్ రెడీ, మంగళం శీను.. అతని భార్య దాక్షాయణి పుష్ప పై ప్రతీకారం తీర్చుకుంటారని.. వీళ్లతోపాటు షికవాత్ గా నటించిన ఫజిద్ ఫాహల్ అల్లు అర్జున్ పై పగ తీర్చుకుంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే పార్ట్ 2 వచ్చే వరకు ఆగాల్సిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :