
ప్రముఖ ఇండియన్ ఐడల్ 12 విజేత పవన్‌దీప్ రాజన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలుస్తుంది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పవన్‌దీప్ తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేత పవన్‌దీప్ రాజన్ ప్రయాణిస్తున్న కారు మే 5న ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జాతీయ రహదారి 9పై ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం సోమవారం ఉదయం 3:40 గంటల సమయంలో గజ్రౌలా పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిందని తెలుస్తుంది.
పవన్‌దీప్ తన స్నేహితుడు అజయ్ మెహ్రా, డ్రైవర్ రాహుల్ సింగ్‌తో కలిసి ఉత్తరాఖండ్‌లోని చంపావత్ నుంచి నోయిడాకు కారులో ప్రయాణిస్తుండగా, రహదారిపై ఆగివున్న ఐషర్ క్యాంటర్ ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టింది. డ్రైవర్ రాహుల్ సింగ్ నిద్రమత్తులో ఉండటం వల్ల కారు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో పవన్‌దీప్‌కు రెండు కాళ్లు, ఒక చేయి, తలకు గాయాలతో పాటు కొన్ని ఎముకలు విరిగాయని తెలుస్తుంది. అతనితో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల సహాయంతో వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం పవన్‌దీప్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆర్థోపెడిక్ టీమ్ పర్యవేక్షణలో వరుస శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పవన్‌దీప్ రాజన్ ఇండియన్ ఐడల్ 12లో విజేతగా నిలిచారు. అంతకుముందు 2015లో ది వాయిస్ ఇండియా విజేతగా కూడా గెలుపొందాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి