Prabhas: ప్రభాస్ కొత్త సినిమా పూజా కార్యక్రమంలో తళుక్కుమన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే

|

Aug 17, 2024 | 4:22 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూర్తి పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ బ్రిటీస్ సోల్జర్ గా కనిపించనున్నాడని సమాచారం

Prabhas: ప్రభాస్ కొత్త సినిమా పూజా కార్యక్రమంలో తళుక్కుమన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే
Prabhas
Follow us on

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూర్తి పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ బ్రిటీస్ సోల్జర్ గా కనిపించనున్నాడని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఈ క్రేజీ సినిమాకు ఫౌజీ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు హీరో ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవ పూడి, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు హాజరయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. అయితే ఈ పూజా కార్యక్రమంలో ప్రభాస్ పక్కన ఓ అందమైన అమ్మాయి మెరిసింది. దీంతో ఈ బ్యూటీ గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. అంతేకాదు ప్రభాస్ సినిమాలో ఈ సొగసరినే హీరోయిన్ అనుకుంటున్నారు జనాలు. మరి అసలు ఈ అమ్మాయి ఎవరు? ప్రభాస్ సినిమా పూజ కార్యక్రమానికి ఎందుకు వచ్చింది? తదితర వివరాలు తెలుసుకుందాం రండి.

ప్రభాస్- హనురాఘవపూడి సినిమా పూజా కార్యక్రమంలో మెరిసిన ఈ బ్యూటీ పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఢిల్లీలో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది. అలాగే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇమాన్ డ్యాన్స్ లకు నెట్టింట భారీగా క్రేజ్ ఉంది. ఎన్నో స్టేజ్‌లపై డ్యాన్స్ షోలు చేసిన అనుభవం కూడా ఉంది. వీడియో ఆల్బమ్స్ తోనూ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఇమాన్ ను 686K అనుసరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ తో ఇమాన్ ఇస్మాయిల్..

సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇమాన్ ప్రభాస్ సినిమా పూజా కార్యక్రమానికి ఎందుకు వచ్చిందనేది మాత్రం అర్థం కావడం లేదు. ఒక వేళ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించేది ఈ అమ్మాయేనా? లేక వేరే రీజన్ తో ఇక్కడకు వచ్చిందా? అన్నది తెలియాలంటే హను రాఘవ పూడి చిత్ర బృందం ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి