యంగ్ హీరో నిఖిల్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవలే కార్తికేయ2 సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. కార్తికేయ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న సినిమా వచ్చినప్పటికీ కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి జతకట్టారు. నిఖిల్ అనుపమ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 18పేజెస్. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ నెల 19న 18పేజెస్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నివహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ విషయాన్నీ అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
అలాగే ఈ చిత్ర యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా క్రేజి వీడియోలను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. కంప్లీట్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.