
జబర్దస్త్ లో చాలా మంది కమెడియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే దూసుకుపోతున్నారు. ఇప్పటికే కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తున్నారు ఆది. తనదైన కామెడీ పంచులతో అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ షోలో టీం లీడర్ అయ్యాడు. తన స్కిట్ కోసమే ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి ఆది చేరారు. అటు జబర్దస్త్.. షో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన ఆది.. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలోనూ తన కామెడీతో అలరించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తుండగా.. ఇంద్రజ జడ్జ్ గా చేస్తున్నారు. ఈ కామెడీ షోలో ఆది పంచ్‌లు.. తోటి కంటెస్టెంట్స్ పై ఆది వేసే జోక్స్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి.
అటు టీవీషోలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు ఆది. ఇటీవల ఆయన వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు ఆది. తాజాగా ఆది ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆది పై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఓ సీరియల్ నటి పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు ఆది. బండ ఆంటీ అంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఢీ డ్యాన్స్ షో కు సంబందించిన ఓ ప్రమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య (దీపిక ) పై ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఢీ షోలో కెమెరామ్యాన్‌తో డ్యాన్స్ చేసింది కావ్య. ఈ డాన్స్ ఫన్నీగా సాగింది. ఆతర్వాత ఆది లేచి.. మీరు పర్మిషన్ ఇస్తే నేను డైరెక్టర్‌గా వాళ్లిద్దరినీ పెట్టి ‘గుండు అంకుల్-బండ ఆంటీ’ అని ఒక సినిమా తీస్తాను.. అని ఆది అన్నాడు. దాంతో దీపికా కూడా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. అలాగే దీపికా ఫ్యాన్స్ కూడా ఆది పై ఫైర్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి