సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)రీసెంట్ గా సర్కారు వారి పాట అంటూ సందడి చేసిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న సూపర్ స్టార్ ఖాతాలో ఈ సినిమా హిట్ కూడా వచ్చి చేరింది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడు మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. తమన్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేస్తున్నారు.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న జక్కన్న మహేష్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీ ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ కోసం జక్కన్న ప్రణాళికలు సిద్ధం చేశారని టాక్. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. ఈ సినిమాకోసం దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు 400 కోట్ల వరకు ఖర్చు చేశారని టాక్ గట్టిగా వినిపించింది. ఇప్పుడు మహేష్ సినిమా కోసం అంతకు మించి ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ కోసమే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయనున్నారని అంటున్నారు. మహేష్ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటించే అవకాశం ఉందని కూడా టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి