
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్స్ ప్రేమ, పెళ్లి, విడాకుల విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో డివోర్స్, సెకండ్ మ్యారెజ్, లవ్ వంటి విషయాలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఓవైపు పలువురు సెలబ్రెటీ కపూల్స్ డివోర్స్ ప్రకటిస్తుండగా.. మరికొందరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు మాత్రం తన భార్యతో కొన్ని సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ సమంయలో తన భార్యకు కోట్ల ఆస్తిని భరణం ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం ఆమెకు తన ఇల్లు అద్దెకు ఇచ్చారని టాక్ నడుస్తుంది. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.
ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కొన్నాళ్లుగా సింగర్, హీరోయిన్ సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పబ్లిక్ గా సినిమా ఈవెంట్స్, బాలీవుడ్ పార్టీలలో పాల్గొంటున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఈ జంట ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతుంటాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ముంబైలోని జుహూ సముద్రతీరంలో ఉన్న తన లగ్జరీ అపార్ట్ మెంట్ ను సబా ఆజాద్ కు రెంట్ కు ఇచ్చాడని టాక్. ఈ ప్లాట్ కోసం ఆమె నెలకు రూ.75000 రెంట్ కడుతుందని.. ఈ అపార్ట్ మెంట్ సబాకు రెంటల్ అగ్రిమెంట్ పై లభించిందట. తన సినిమా, మ్యూజిక్ వర్క్ కోసం ఈ అపార్టమెంట్స్ ఉపయోగిస్తుందట సబా.
ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..
గతంలో ఈ ఇంటిని హృతిక్ తన సినిమా పనుల కోసం ఉపయోగించాడని సమాచారం. ఇప్పుడు అదే ఇంటిని సబాకు అద్దెకు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సబా ఇప్పటికే హిందీలో పలు చిత్రాల్లో నటించింది. నటిగానే కాకుండా సింగర్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరు కలిసి ఈవెంట్లలో సందడి చేసే వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..