Akhanda: ‘అఖండ’పై హాలివుడ్ క్రిటిక్ సైమన్ అబ్రంస్ ప్రశంసల వర్షం.. ‘ఎఫిక్ ఫిల్మ్’ అంటూ కామెంట్
బాక్సాఫీసు వద్ద బాలయ్య సింహనాదం కొనసాగుతోంది. 'అఖండ'గా నటసింహం గర్జిస్తున్నాడు. భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నాడు.
బాక్సాఫీసు వద్ద బాలయ్య సింహనాదం కొనసాగుతోంది. ‘అఖండ’గా నటసింహం గర్జిస్తున్నాడు. భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నాడు. ‘అఖండ’తో బాలయ్య 100 కోట్ల మార్క్ అందుకోవడం గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ పండితులు. మరోసారి నటసింహం తెలుగు సినిమాకు ఊపిరి పోశాడని టాప్ హీరోలు సైతం ట్వీట్లు వేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఊహించని విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇటీవలే ఫేమస్ సోషల్ మీడియా పర్సనాలిటీ అన్షుల్ సక్సేనా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల కావాలని ఆకాక్షించాడు. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం క్రిటిక్ సైమన్ అబ్రంస్ ‘అఖండ’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ ఎపిక్ ఫిల్మ్ అఖండ ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశానని.. ఒక సాధారణ వ్యక్తి అవినీతిపరుడైన మైన్ ఓనర్‌తో గొడవ పడతాడని పేర్కొన్నారు. ఇక సెకండ్ హాఫ్‌లో హీరో ట్విన్ బ్రదర్ ‘అఖండ’ వచ్చాక సీన్స్ చాలా స్పెషల్ అని తెలిపారు. మూవీలో కార్టూనిష్ సెట్స్, విండ్ మెషిన్లు, మాస్టర్ షాట్స్, క్లోజప్ షాట్స్, కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని పొగడ్తలు గుప్పించారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే తన చెవులు పగిలిపోతాయని అనిపించిందని.. మూడవ కన్ను తెరిచుకున్నట్లు అయ్యింది పేర్కొన్నారు. శివుడి రూపంలో అఖండ ఫైట్ సీన్ అద్భుతం అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
తెలుగు సినిమా గురించి ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్ ఈ స్థాయిలో పొగడ్తలు గుప్పించడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక 10 శాతం వర్గాన్ని మినహాయిస్తే.. 90 శాతం ఆడియెన్స్ నుంచి సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వస్తుంది. ఇక బాలయ్య అఖండ ఇంకెన్ని మెరుపులు మెరిపిస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Akhanda fights while possessed by the god Shiva. He impales a few heavies with his trident. Akhanda also rearranges the main heavy’s chakras one by one, naming each body part he’s destroying (solar plexus chakra!). He’s friend to zebu and children. Akhanda is righteous.
— Simon Abrams (@simonsaybrams) December 3, 2021
Also Read: నెట్టింట తెగ వైరల్ అవుతోన్న చైతన్య, సమంతల ఓల్డ్ ఫోన్ కాల్…