
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు..నటనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగు, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు ధనుష్. ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం హీరోయిజం సినిమాలే కాకుండా.. నిత్యం వైవిధ్యమైన అంశాలున్న కథలను ఎంచుకోవడంలో ముందుంటారు. సినిమా కంటెంట్.. పాత్ర ప్రాధాన్యత కోసం ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు రెడీ అవుతారు. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అలాగే డైరెక్టర్ పాండి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హీరోయిన్లకు ధనుష్ జోడిగా నటించాలంటే ఆలోచించాల్సిందే అంటున్నారు నెటిజన్స్. అందుకు మరో కారణం కూడా ఉంది…
ధనుష్ సరసన ఎంతటి టాలెంటెడ్ హీరోయిన్ అయినా.. ఎంత స్టా్ర్ హీరోయిన్ అయినా నటించినా ఆమెకు ఏమాత్రం గుర్తింపు రావడం లేదు. ఎందుకంటే.. అడియన్స్ అంతా కేవలం ధనుష్ మీద మాత్రమే దృష్టి పెడతారు. అంతగా ప్రేక్షకులకు తన యాక్టింగ్ తో కనెక్ట్ అవుతాడు ధనుష్. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు. ధనుష్ తన యాక్టింగ్ స్కిల్స్ రోజురోజుకు మెరుగవుతుండడంతో అభిమానులు తన గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా చూస్తున్న వారంతా ధనుష్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఎవరూ గమనించారు. అలా ధనుష్ సినిమాలో నటించే హీరోయిన్స్ అందరికీ ఎదురయ్యే సినిమా ఇది.
హీరోయిన్లు ఎంత బాగా నటించినా అందరి చూపు ధనుష్ పైనే ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, యాక్షన్ అన్నింటిలోనూ ధనుష్ కు మించినవారు లేరు. హిందీలో ఆత్రంగి రే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇందులో అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, ధనుష్ ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ఈ మూవీ క్రెడిట్ మొత్తం ధనుష్ కొట్టేశాడు. అంతగా సినిమాపై ప్రభావం చూపిస్తుంది ధనుష్ యాక్టింగ్. అందుకే ఈ హీరోతో నటించాలంటే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఆలోచనలో పడిపోతుంది.