Pranitha: ప్రిన్సెస్‏లా ముస్తాబయిన ప్రణీత.. డ్రెస్‏తో ఇబ్బందిపడిన హీరోయిన్.. చివరకు..

|

Oct 12, 2022 | 10:24 AM

తాజాగా హీరోయిన్ ప్రణీత సైతం తన డ్రెస్సుతో ఇబ్బంది పడింది. ఏకంగా తన ఫోన్‏నే కింద పడేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Pranitha: ప్రిన్సెస్‏లా ముస్తాబయిన ప్రణీత.. డ్రెస్‏తో ఇబ్బందిపడిన హీరోయిన్.. చివరకు..
Pranitha
Follow us on

వెండితెరపై హీరోయిన్ అంటే అభినయం మాత్రమే కాదు.. అందం కూడా ముఖ్యమే. కథానాయికగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నటనతోపాటు.. ప్రేక్షకుల మనసులు కూడా దొచుకోవాలి. కేవలం సినిమాలోనే కాకుండా.. ఈవెంట్స్‏లో హీరోయిన్ స్పెషల్. అందంగా ముస్తాబై సందడి చేస్తుంటారు. అయితే డ్రెస్సింగ్ స్టైల్‏కు వచ్చేసరికి అనేక సార్లు ఇబ్బందులు పడుతుంటారు. కొత్త కొత్త ట్రెండ్స్ యూత్‏కు పరిచయం చేయబోయి.. వారు పడే ఇబ్బంది గురించి తెలిసిందే. హీరోయిన్స్ ధరించే డ్రెస్సులను సరిచేసేందుకు వారి సహాయకులు హెల్ప్ చేస్తుంటారు. కొన్నిసార్లు వాటితోనే కిందపడిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయి. తాజాగా హీరోయిన్ ప్రణీత సైతం తన డ్రెస్సుతో ఇబ్బంది పడింది. ఏకంగా తన ఫోన్‏నే కింద పడేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇటీవల పాపకు జన్మనిచ్చిన ప్రణీత.. తిరిగి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. పాప ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. తాజాగా ఓ ఈవెంట్‏కో వెళ్లిన ప్రణీత.. ప్రిన్సెస్‎లా రెడీ అయ్యింది. ఖరీదైన గౌను ధరించి చూపు తిప్పుకోనివ్వనంత అందంగా ముస్తాబు అయ్యింది. అయితే తన కారు నుంచి దిగే సమయంలో డ్రెస్సుతో ఇబ్బంది పడింది. తన ఒడిలో ఫోన్ పెట్టుకున్న విషయం మర్చిపోయి అలాగే దిగిపోయింది. దీంతో ఆమె మొబైల్ కిందపడిపోయింది. ఫోన్ పడిపోవడంతో ఒక్కసారిగా షాకయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రణీత. ఈ మూవీతో అమ్మడి క్రేజ్ మారిపోయింది. ఆ తర్వాత రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బావ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయం ఉన్నా.. ప్రణీతకు మాత్రం అవకాశాలు రాలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.