Madhubala: ఈ అందాల హీరోయిన్‌కు ఆ స్టార్ హీరో.. ఈ కుర్ర హీరో అంటే ఇష్టమట.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

|

Dec 10, 2022 | 8:36 AM

ఇప్పటికి అదే అందంతో ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన మధుబాల.  ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. 

Madhubala: ఈ అందాల హీరోయిన్‌కు ఆ స్టార్ హీరో.. ఈ కుర్ర హీరో అంటే ఇష్టమట.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
Madhubala
Follow us on

ఒకప్పటి అందాల భామల్లో ముందు వరసలో ఉండే హీరోయిన్ మధుబాల. చూడచక్కని రూపం తో ప్రేక్షకులను కట్టిపడేసేవారు మధుబాల. ఐశ్వర్య రాయితో అందంలో పోటీపడ్డ బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది మధుబాల అనే చెప్పాలి. ఇప్పటికి అదే అందంతో ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన మధుబాల.  ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్స్ కు అమ్మగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో మధుబాలకు భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె ప్రేమ దేశం అనే సినిమాలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు మధుబాల. తాజాగా ఒక ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ గురించి మాట్లాడారు మధుబాల. హీరోయిన్స్ విషయంలో తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆమె డాన్స్ నటన చాలా నచ్చుతుందని మెచ్చుకున్నారు. అలాగే హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కు వీరాభిమానిని అని అన్నారు మధుబాల.

అలాగే ఈతరం హీరోలలో నాగచైతన్య అంటే నాకు ఎంతో ఇష్టమని మధుబాల చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధు బాల చేసిన కామెంట్స్ తో అటు పవన్ అభిమానులు, ఇటు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. పవన్ అభిమానులు ఇటు చైతన్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమె కామెంట్స్ ను షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి