సీరియల్ నటి ఘనకార్యం.. పెళ్లి చేసుకొని భర్త దగ్గరే 25లక్షలు కాజేసింది..
ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య. ఈ అమ్మడు పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సినిమాల్లోనూ కనిపించింది. 3 ముఖి, నీ రూటే సెపరేట్, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీవంటి సినిమాల్లో నటించింది. అలాగే అమ్మాయిగారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం అనే సీరియల్స్ లోనూ కనిపించింది.

నా భార్య నన్ను వేధిస్తోందని ఓ నటి భర్త వాపోతున్నాడు. పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు.? ఆ నటి ఎవరు.? ఎలా మోసం చేసింది.? వివరాల్లోకి వెళ్తే ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య. ఈ అమ్మడు పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సినిమాల్లోనూ కనిపించింది. 3 ముఖి, నీ రూటే సెపరేట్, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీవంటి సినిమాల్లో నటించింది. అలాగే అమ్మాయిగారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం అనే సీరియల్స్ లోనూ కనిపించింది. అయితే ఈ చిన్నది ఓ వ్యక్తి పెళ్లి చేసుకొని అతని వద్ద 25 లక్షలు కాజేసింది. ఆమె భర్త ఇప్పుడు ఆ నటి గురించి, ఆమె చేసిన మోసం ;గురించి బయట పెట్టాడు.
ఓ మ్యాటిమోని ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది..ఇరువురికీ నచ్చడంతో గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన పిన్నింటి శ్యామ్ కుమార్ – అడ్డాల ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి హైదరాబాద్‌కు వెళ్లగా..కొద్దిరోజులకే ఆమె నిజస్వరూపం తెలిసిందని.. పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటున్నాడు శ్యామ్..ఐశ్వర్య అఫైర్ గురించి తనకు తెలిసి నిలదీస్తే తనపైనే ఎదురుదాడి చేసిందని వాపోయాడు.
తనకు వేధించడమే కాకుండా విడాకులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతుందని.. తన వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు శ్యామ్ కుమార్. తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని.. తనకు న్యాయం చేయాలని కోరాడు శ్యామ్.. ఆరు నెలల్లో తనను బెదిరించి 25 లక్షలు తీసుకుందని తెలిపాడు శ్యామ్ కుమార్. ఐశ్వర్యకు.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో సంబంధం ఉందని.. అతను చెప్పినట్టు ఆమె చేస్తుందని తెలిపాడు శ్యామ్ కుమార్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.