Tollywood: క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి కమెడియన్ వరకు.. 200కిపైగా సినిమాల్లో నటించిన ఈ నటి ఎవరంటే.?

అప్పటి కమెడియన్లు.. ఇప్పుడు ఎలా మారిపోయారోనంటూ పలు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా అలాంటి ఓ పిక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈమె ఒకప్పటి స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఏంటి.? ఇలా మారిపోయింది అంటూ నెటిజన్లు అవాక్ అవుతున్నారు.

Tollywood: క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి కమెడియన్ వరకు.. 200కిపైగా సినిమాల్లో నటించిన ఈ నటి ఎవరంటే.?
Tollywood

Updated on: Sep 28, 2025 | 9:00 AM

పైన పేర్కొన్న ఫోటోలోని నటిని గుర్తుపట్టారా.? ఈమె ఒకప్పటి స్టార్ కమెడియన్. కెరీర్ అరంగేట్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా.. ఆ తర్వాత 200కిపైగా చిత్రాల్లో నటించి.. స్టార్ కమెడియన్‌గా ఎదిగింది. 1980వ దశకంలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా.. ఇలా వివిధ రకాల పాత్రల్లో నటించి అభిమానులను అలరించింది. ఈమె తెలుగమ్మాయ్ కాగా.. పరిచయం అయింది మాత్రం మలయాళ ఇండస్ట్రీ నుంచి. మరి ఇంతకీ ఆమె ఎవరిని అనుకుంటున్నారా.?

ఆమె మరెవరో కాదు.. అనూజరెడ్డి. గుంటూరులో జన్మించిన ఆమె 14 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో చెన్నైలోని కోడంబాక్కంలో నివాసముంటున్న అనూజను ఓ చిత్ర యూనిట్ చూసి.. వెంటనే తమ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అప్పట్లో తెలుగులో బ్రహ్మానందం, అనూజ మధ్య వచ్చే ప్రతీ కామెడీ సీన్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ‘చంటి’, ‘పెళ్లి చేసుకుందాం’ లాంటి సినిమాల్లో తనదైన శైలి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనూజ. 2004లో చివరిసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించింది అనూజ రెడ్డి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉన్న అనూజ.. ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మీరూ ఓసారి ఫోటోలపై లుక్కేయండి.