ఇన్నాళ్లకు హీరోగా వస్తున్న వెంకట్.. వరల్డ్ వైడ్‌గా విడుదలకానున్న హరుడు
హీరో వెంకట్ మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సినిమా హరుడు. ఈ సినిమా మే 8న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. వెంకట్ గతంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆతర్వాత కనిపించకుండా మాయం అయ్యాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలతో తిరిగి బిజీ అవుతున్నాడు.

శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు, రీసెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సహా నిర్మాతలుగా దిక్కల లక్ష్మణ్ రావు. ప్రవీణ్ రెడ్డి ఉన్నారు.. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి
‘ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్ గారి ఇది మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది’ చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రంలో హెబ్బపటేల్, సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మని జీన్న సంగీతం అందిస్తుండగా ఆనంద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతీ ఎడిటర్. ఇక ఈ సినిమాలో వెంకట్ తోపాటు శ్రీహరి ,హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ, సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ , వేద్విక,చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ. దిల్ రమేష్, దొరబాబులు నటిస్తున్నారు.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




