AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మ పక్కన అమాయకంగా ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు తోపు యాక్టర్.. కనిపెట్టారా..?

ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు తెలుగునాట బిజీ యాక్టర్. విలక్షమైన పాత్రలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. తాజాగా అతడు తన మదర్‌తో చిన్నప్పుడు దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నటుడు ఎవరో మీరు కనిపెట్టగలరా..? క్లూ ఏంటి అంటే ఇతడు హీరోగా చేసిన సినిమాను రాజమౌళి ప్రొడ్యూస్ చేశాడు.

Tollywood: అమ్మ పక్కన అమాయకంగా ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు తోపు యాక్టర్.. కనిపెట్టారా..?
Actor Childhood Photo
Ram Naramaneni
|

Updated on: Apr 10, 2024 | 12:48 PM

Share

కథా నాయకుడి మాత్రమే చేయాలని.. రూల్ పెట్టుకోవడం వేరు.. ఎలాంటి రోల్ అయినా సరే.. చేసేందుకు ముందుండటం వేరు. రెండవ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఆ లిస్ట్‌లో దగ్గుబాటి వారి అబ్బాయ్ రానా ముందున్నాడు. క్యారెక్టర్ బాగుంటే చాలు.. ఎంతసేపు సినిమాలో ఉంటాం..? ఫైట్స్, సాంగ్స్ ఉన్నాయా..? అని చూడడు. సినిమాకు ఓకే చెప్పేస్తాడు. ఇక తనకు తానుగా కష్టపడి ఎదిగిన నటుడు నవీన్ చంద్ర సైతం రానా మార్గాన్నే అనుసరిస్తున్నాడు. ఒకవైపు హీరోగా మూవీస్ చేస్తూనే.. మరోవైపు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. అప్పుడప్పుడు విలన్ పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. నవీన్ చంద్ర తెలుగు అబ్బాయే. కాకపోతే బళ్లారిలోని దేవి నగర్‌లో జన్మించాడు. అతని తండ్రి కర్నాటక రోడ్డు రవాణా సంస్థలో హెడ్ మెకానిక్. నవీన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కంప్లీట్ చేశాడు. ఇండస్ట్రీకి రాకముందు మల్టీమీడియా యానిమేటర్‌గా కొన్నాళ్లు పనిచేశాడు.

2006లోనే చిత్రసీమకు వచ్చిన.. 2012లో వచ్చిన అందాల రాక్షసి చిత్రం ద్వారా అతడికి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసినా.. పెద్దగా లక్ కలిసిరాలేదు. దీంతో నేను లోకల్ సినిమాలో విలన్ ఛాయలు ఉన్న పాత్రలో నటించాడు. అప్పటి నుంచి అతడి సుడి తిరిగిపోయింది. అరవింద సమేత వీరరాఘవ మూవీలో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రోల్ చేశాడు. ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన భానుమతి & రామకృష్ణ మూవీతో హీరోగా మంచి హిట్‌ కొట్టాడు. వీరసింహారెడ్డి చిత్రంలోనూ అతడి రోల్ బాగుంటుంది. మొన్నామధ్య హీరోగా మంత్ ఆఫ్ మధు చిత్రం చేశాడు కానీ పెద్దగా వర్కువుట్ అవ్వలేదు.

మొత్తంగా హీరోగా మంచి విజయాలు దక్కకపోయినా.. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు వచ్చిన ప్రతి చాన్స్ వినియోగించుకుని.. ముందుకు సాగుతున్నాడు. తాజాగా అతడు తన మదర్‌తో చిన్నప్పుడు దిగిన ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అందులోని చిన్నోడు.. నవీన్ చంద్ర అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు