న్యాచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీరామనవవి కానుకగా మార్చి 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక సినిమాలో నాని, కీర్తి సురేశ్‌ల అభినయానికి అందరూ ఫిదా అవుతున్నారు. మహేశ్‌బాబు, ప్రభాస్ లాంటి స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి మెచ్చకున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి దసరా సినిమాను వీక్షించారు. అనంతరం మూవీపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మాస్ పాత్రల మధ్య హృదయ్నాని హత్తుకునే సున్నితమైన ప్రేమకథను చూపించడంలో శ్రీకాంత్ ఓదెల విజయం సాధించాడు. నాని కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి అద్భుతంగా నటించింది. ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ అయితే నెక్ట్స్ లెవల్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! అద్భుత విజయం అందుకున్న దసరా టీమ్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని దసరా టీంను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
రాజమౌళి ట్వీట్‌కు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందించారు. ‘ ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియడం లేదు’ అంటూ లవ్ సింబల్స్ షేర్ చేసి దండం పెట్టాడు. ఇక హీరో నాని అయితే ఓ రేంజ్‌లో రిప్లై ఇచ్చాడు. ‘సార్..ఇదే మాకు ఆస్కార్ వచ్చినట్టు’ అని పొంగిపోయాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి దసరా సినిమాను నిర్మించారు. ఇప్పటికే రూ.87 కోట్లు రాబట్టిన ఈ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్ర ఖని, షైన్ టామ్ చాకో, సాయికుమార్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.త్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేశాడు. సంతోశ్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు.
Sirrrr…. This is our #Dasara team’s Oscar ♥️ @ssrajamouli https://t.co/3oA43yYSkW
— Nani (@NameisNani) April 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..