Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Twitter Review: దసరా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. నాని హిట్ కొట్టినట్టేనా..

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మాస్ పాత్రలో నటించాడు. అలాగే కీర్తి డీ గ్లామర్ పాత్రను పోషించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Dasara Twitter Review: దసరా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. నాని హిట్ కొట్టినట్టేనా..
Dasara
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 30, 2023 | 6:38 AM

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా.. నేడు గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మాస్ పాత్రలో నటించాడు. అలాగే కీర్తి డీ గ్లామర్ పాత్రను పోషించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మార్చి 30న అనే నేడు రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రీమియర్స్ జరిగాయి.

విదేశాల్లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో నాని నటన పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. గోదావ‌రి ఖ‌ని స‌మీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ రా అండ్ ర‌స్టిక్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందని అంటున్నారు.