Nani: వైజాగ్ మ్యాచ్‌లో సందడి చేసిన నాని.. టీమిండియా ప్లేయర్లకు సినిమా పేర్లు పెట్టిన న్యాచురల్ స్టార్
విశాఖపట్నం వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని సందడి చేశారు. తన తాజా సినిమా దసరా ప్రమోషన్లలో భాగంగా ఇక్కడకు వచ్చేసిన అతను కామెంటేటర్‌గా అవతారమెత్తాడు.

విశాఖపట్నం వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని సందడి చేశారు. తన తాజా సినిమా దసరా ప్రమోషన్లలో భాగంగా ఇక్కడకు వచ్చేసిన అతను కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, లేడీ కామెంటేటర్‌తో ముచ్చట్లు పెట్టాడు. వారు అడిగే ప్రశ్నలకు సమధానాలు ఇస్తూనే బ్యాట్ పట్టుకుని వివిధ రకాల స్టిల్స్‌తో ఫొటోలకు పోజులిచ్చాడు. అలాగే క్రికెట్ తో తనకు ఉన్న అనుబంధాన్ని కామెంటేటర్స్ తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు. సచిన్ ఆటకు తాను పెద్ద ఫ్యాన్ అని, అతను ఔట్ అవ్వగానే టీవీలు ఆపేసేవాళ్లమని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్‌కు ‘దసరా’ సినిమా లోని ‘ధూమ్ ధామ్’ సిగ్నేచర్ స్టెప్‌ను నాని నేర్పించాడు. ఇద్దరూ కలసి ఆ స్టెప్ వేసేసరికి అభిమానుల కేరింతలు, ఈలలతో వైజాగ్ స్టేడియం దద్దరిల్లిపోయింది.
ఇక తెలుగు కామెంటరీ టీమ్‌తో మాట్లాడిన నాని తన సినిమాల పేర్లు ఏ క్రికెటర్లకు బాగుంటాయన్న విషయంపై ఆసక్తికర సమాధానాలిచ్చాడు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జెంటిల్‌మెన్ అని టైటిల్ ఇవ్వగా, కింగ్ విరాట్ కోహ్లీకి గ్యాంగ్ లీడర్ పేరు ఇచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యాకు అయితే పిల్ల జమీందార్ టైటిల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..