Manchu Manoj: అన్న నువ్వు రియల్ హీరో.. మంచు మనోజ్ పై నెటిజన్స్ ప్రశంసలు

కృతిసనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఆదిపురుష్. రామరావణుల యుద్దాన్ని కళ్ళకు కట్టేలా దర్శకుడు చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు .

Manchu Manoj: అన్న నువ్వు రియల్ హీరో.. మంచు మనోజ్ పై నెటిజన్స్ ప్రశంసలు
Manchu Manoj
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2023 | 8:39 AM

నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తోంది ప్రభాస్ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది. కృతిసనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఆదిపురుష్. రామరావణుల యుద్దాన్ని కళ్ళకు కట్టేలా దర్శకుడు చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు . ఇక రావణుడి సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ దక్కాయని తెలుస్తోంది. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పై సినీ తారలు కూడా ఆసక్తి చూపిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల టికెట్స్, అభిషేక్ అగర్వాల్ 10వేల టికెట్స్, టీ సిరీస్ ఏకంగా 12 వేల టికెట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలాగే మంచు మనోజ్ కూడా 2500 టికెట్స్ ను కొనుగోలు చేశారు.

మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఆదిపురుష్ సినిమా టికెట్స్ 2500 కొనుగోలు చేసి అనాథ పిల్లలకు అందించారు. నిన్న సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఆ పిల్లలతో కలిసి సినిమా చూశారు మనోజ్ దంపతులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ హీరో మంచి మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. నువ్వు రియల్ హీరోవి అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.