AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthi: నాగార్జున అన్న సపోర్ట్ ని మర్చిపోలేను.. కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు.

Karthi: నాగార్జున అన్న సపోర్ట్ ని మర్చిపోలేను.. కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Hero Karthi
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2022 | 9:21 AM

Share

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సర్దార్. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైయింది. అన్నపూర్ణ స్టూడియోస్ కింగ్ నాగార్జున తెలుగులో విడుదల చేసిన ఈ చిత్రం దీపావళి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కార్తి మాట్లాడుతూ..

“సర్దార్ చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాగా చేశాం. ఈ సినిమా కోసం ఒక వార్ లా పని చేశాం. ఇప్పుడు ప్రేక్షకుల నుండి సర్దార్ కి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా వుంది. ఖాకీ, ఖైధీ చిత్రాల్లానే కొత్తగా చేస్తే తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు సర్దార్ తో మరోసారి నిరూపించారు. మేము పడ్డ కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు ప్రేక్షకులు. పిఎస్ మిత్రన్ సినిమా కోసం ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రేక్షకులందరికీ అర్ధమయ్యేలా చెప్పడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. యూనిట్ లో అందరినీ సినిమాలో భాగం చేస్తాడు. అందరినుండి సలహాలు, సూచనలు తీసుకుంటాడు అన్నారు.

అలాగే ఈ సినిమా కోసం రోజుకి ఇరవైగంటలు పని చేసి కూడా తర్వాత రోజు మళ్ళీ షూటింగ్ వెళ్లాను. దీనికి కారణం మిత్రన్ వర్కింగ్ స్టయిల్. చాలా ఎక్సయిమెంట్ తో ఈ సినిమా చేశాం. రజిషా విజయన్ అద్భుతంగా నటించింది. ఇది నేరుగా తెలుగులో చేసిన సినిమాలా అద్భుతంగా డైలాగులు రాశారు రాకేందుమౌళి. అభిమాన్యుడు తర్వాత సెల్ ఫోన్ చూసి ఎలా భయపడ్డారో .. సర్దార్ చూసిన తర్వాత బాటిల్ చూస్తుంటే భయపడుతున్నారు. నాగార్జున అన్న సపోర్ట్ ని మర్చిపోలేను. సుప్రియగా ప్రెస్ మీట్ కి రావడం అనందంగా వుంది. నిర్మాత లక్ష్మణ్ కి కృతజ్ఞతలు. సినిమా అనేది ఒక కల్చర్ గా వున్న మన దేశంలో ఒక నటుడిగా వుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అభిమానులతో కలసి సర్దార్ చూడటానికి వెళ్తున్నాను. సర్దార్ కి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు కార్తి.

ఇవి కూడా చదవండి
Follow Us
లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
కర్తవ్యం 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..?
కర్తవ్యం 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..?
ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?
ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?
ఏం కొడుతున్నావ్ అక్క! మేస్ట్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా
ఏం కొడుతున్నావ్ అక్క! మేస్ట్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా
బ్యాచిలర్స్ కూడా మెచ్చే ఈజీ చికెన్ సుక్కా.. వండితే ప్లేట్ ఖాళీ
బ్యాచిలర్స్ కూడా మెచ్చే ఈజీ చికెన్ సుక్కా.. వండితే ప్లేట్ ఖాళీ
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు శాస్త్రం..
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు శాస్త్రం..
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి, చిరంజీవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి, చిరంజీవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్..
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్..
కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!
కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!
ఝులన్ గోస్వామి బాటలోనే రోహిత్ శర్మ
ఝులన్ గోస్వామి బాటలోనే రోహిత్ శర్మ